కీర్తి సురేష్ మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. మరి అంత తక్కువా..?

ప్రస్తుతం దక్షిణాది భారత దేశంలో మంచి పాపులారిటీ సంపాదించిన హీరోయిన్లలో కీర్తి సురేష్ కూడా ఒకరు.. ఒకవైపు హీరోయిన్ గా పలు లేని ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తూ తన సత్తా చాటుతోంది ఈ ముద్దుగుమ్మ. చివరిగా మహేష్ బాబు తో కలిసి సర్కారు వారి పాట సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో పాటు దసరా సినిమాలో కూడా నటించి మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం చిరంజీవితో కలిసి భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. ఇందులో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది.

Keerthy Suresh (Actress) Wiki, Height, Weight, Age, Boyfriend, Biography &  More - Stars Biog

2013లో మొదటిసారిగా మలయాళం చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ప్రస్తుతం ఒక చిత్రానికి రూ.3.5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే కీర్తి సురేష్ మొదటి పారితో సుఖం ఎంత తీసుకొందని విషయం అభిమానులు తెలుసుకునేందుకు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

కీర్తి సురేష్ మొదటి సంపాదన కేవలం రూ .500 రూపాయలే నట.. చిన్న వయసు నుంచి ఫ్యాషన్ నాటకాల పైన ఆసక్తి పెంచుకుంది. దీనికి తోడు ఈమె తల్లి మేనక కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కావడంతో కీర్తి సురేష్ మనసు కూడా సినిమాల వైపు మళ్ళింది. బాల నటి గా రెండు మూడు సినిమాలలో నటించిన కీర్తి సురేష్ కాలేజీ చదువుతున్న సమయంలో ఒక పేషెంట్ షోలో పాల్గొనింది అలా మొదటిసారి రూ .500 రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుందట. 2013లో కాలేజ్ చదువుతున్న సమయంలో గీతాంజలి అనే ఒక హర్రర్ చిత్రంలో కీర్తి సురేష్ ద్విపాత్రాభినయంలో నటించింది. కీర్తి సురేష్ తన మొదటి రెమ్యూనరేషన్ తన తల్లిదండ్రులకు ఇచ్చి ఏదైనా మంచి పనికి ఉపయోగించమని సలహా ఇచ్చిందట.