బాల‌య్య అఖండ 2 వ‌స్తోంది… చిన్న మెలిక పెట్టారుగా…!

టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబో అంటే ఎంత క్రేజీ కాంబినేషన్ ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఈ కాంబోలో సినిమా వచ్చిందంటే చాలు బాలయ్య ఫ్యాన్స్ కి పండగలా ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే సింహా, లెజెండ్‌, అఖండ లాంటి హ్యాట్రిక్ హిట్లు వచ్చాయి. అఖండ‌ బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం బాలయ్య – అనిల్ రావిపూడి డైరెక్షన్లో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు తెరపైకి వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమా టీజర్ రిలీజ్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచింది. ఇక బాలయ్య ఈ సినిమా తరువాత బాబి తో కలిసి ఎన్‌బీకే 109 సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీర సింహారెడ్డి సినిమాతో సక్సెస్ సాధించిన బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా తర్వాత మరోసారి బోయపాటితో అఖండ 2 సినిమాలో నటించాలని ప్రయత్నిస్తున్నాడట. ఇక్క‌డ ఓ మెలిక ప‌డింది. ఇప్పటికే బాలయ్య – బాబి సినిమాలో నటిస్తున్నాడు. బోయపాటి కూడా స్కంద సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. బాలకృష్ణ – బాబీ కాంబినేషన్ మూవీ 5 నెలలు పాటు షూటింగ్ జరుగుతుందట.

దీంతో ఈ టైంలో బోయపాటి కూడా స్కందాను ఫినిష్ చేసి మరో హీరోతో సినిమాను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని తరువాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా సెట్స్‌పైకి రాబోతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఎన్‌బీకే 109 బాబి తో సినిమా చేస్తున్న బాలయ్య.. గోపీచంద్ మలినేని తో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దీంతో ఎన్.బి.కె108 నుంచి 110 వరుస సినిమాలను లైన్లో ఉంచుకున్నాడు బాల‌య్య‌. ఈ సినిమాలు భారి సినిమాలు కావడంతో ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.