కొత్త కండీష‌న్స్ తో నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్న‌ `బేబీ` బ్యూటీ.. ఒక్క హిట్ కే అంత బ‌లుపా?

వైష్ణ‌వి చైత‌న్య‌.. ఈ బ్యూటీ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల విడుద‌లైన బేబీ మూవీతో వైష్ణ‌వి చైత‌న్య సృష్టించిన సెన్సేష‌న్ అంతా ఇంతా కాదు. తెలుగు అమ్మాయి అందులోనూ ఒక‌ యూట్యూబ్‌ స్టార్ అయిన వైష్ణ‌వి చైత‌న్య‌.. బేబీలో త‌న న‌ట‌నా విశ్వ‌రూపం చూపించింది. యూత్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.

ప్ర‌స్తుతం వైష్ణ‌వి చైత‌న్య‌కు ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి. ఇప్ప‌టికే పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ పోతినేని హీరోగా తెర‌కెక్కుతున్న `డబుల్ ఇస్మార్ట్‌`లో ఒక హీరోయిన్ గా న‌టించే ఛాన్స్ వైష్ణ‌వి చైత‌న్య‌కు వ‌చ్చిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఈ విష‌యంపై ఇంత‌వ‌ర‌కు క్లారిటీ రాలేదు. కానీ, బేబీ బ్లాక్ బ‌స్ట‌ర్ అనంత‌రం వైష్ణ‌వి చైత‌న్య మాత్రం కొత్త కండీష‌న్స్ తో నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తుంద‌ట‌.

కోటి రూపాయిల‌కు త‌గ్గ‌కుండా రెమ్యున‌రేష‌న్ ఇవ్వాల‌ని, అలాగే సినిమాకు సైన్ చేసిన వారం రోజులు లోపే ముప్పై శాతం అడ్వాన్స్ ఇచ్చేయాల‌ని వైష్ణ‌వి నిర్మాత‌ల‌కు చెబుతుంద‌ట‌. అంతేకాదు, తాను కేటాయించిన డేట్స్ నే క‌న్ఫామ్ చేయాల‌ని అంటుంద‌ట‌. ఈ కండీష‌న్స్ కు ఒప్పుకుంటేనే సినిమాకు సైన్ చేస్తాన‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు వైష్ణ‌వి చైత‌న్య కండీష‌న్స్ పెడుతుందంటూ నెట్టింట ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు గానీ.. నెటిజ‌న్లు మాత్రం ఒక్క హిట్ కే అంత బ‌లుపా అంటూ వైష్ణ‌విపై సెటైర్లు పేలుస్తున్నారు.