నందమూరి తారక రామారావు నట వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంతోమంది స్టార్ హీరోస్ అడుగుపెట్టినా నందమూరి నటసింహం బాలయ్య, ఎన్టీఆర్‌లు మాత్రమే టాలీవుడ్ లో మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్నారు. వరుస ప్లాపులను చెవి చూస్తున్న బాలయ్య అఖండా లాంటి భారీ హిట్ కొట్టడంతో ఒక్కసారిగా బాలయ్య క్రేజ్ పెరిగిపోయింది. దాంతోపాటే ఓటిటి వేదికగా వచ్చిన అన్ స్టాప బుల్ కు విపరీతమైన క్రేజ్ రావడంతో ఈ జనరేషన్ యువత ఎంతోమందికి కూడా బాలయ్య అభిమాన హీరోగా మారిపోయాడు.
ఇక ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనదైన స్టైల్ లో కోట్లాదిమంది అభిమానులను ఆకట్టుకుంటున్నాడు ఎన్టీఆర్. గతంలో ఈ బాబాయి, కొడుకుల మధ్యన ఏవో గొడవలు జరిగాయి అంటూ.. వీరిద్దరూ ఒకరితో ఒకరు బంధుత్వాన్ని తెంచేసుకున్నారంటూ.. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి అంటూ.. వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇటీవల తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని కుమారుడు హర్ష పెళ్లి వైభవంగా జరిగింది.
ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో బాలయ్య జూనియర్, ఎన్టీఆర్ ఒకే ఫ్రేమ్‌లో మెరిసారు. వీరిద్దరూ ఆప్యాయంగా పలకరించుకుంటున్న తీరును చూసిన అభిమానులు వీరిద్దరి మధ్యన మనస్పర్ధలు లేవని ఎంతో ఆప్యాయంగా ఉన్నారన్నడానికి ఇదే ఉదాహరణ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వీరిద్దరు ఒకే వేదికపై కనబడడంతో రెండు కళ్ళు చాలడం లేదని అభిమానులకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య ఎన్‌టీఆర్ కాంబినేషన్లో సినిమా వస్తే బాగుంటుంది అంటూ ప్రేక్షకులు ఆశపడుతున్నారు.