వామ్మో శ్రీ లీలా మామూల్ది కాదుగా.. ఏకంగా అల్లు అర్జున్ కే..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయి ఇప్పుడు ఐకాన్ స్టార్ గా చలామణి అవుతున్నారు. ఇలాంటి స్టార్ హీరోతో అవకాశం లభిస్తే ఏమాత్రం వదులుకోరు. అంతేకాదు ఆయనతో అవకాశం కోసం పరితపిస్తూ ఉంటారు. అలాంటిది ఈయనతో అవకాశం వస్తే యంగ్ బ్యూటీ శ్రీ లీలా సున్నితంగా రిజెక్ట్ చేసిందట. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

యంగ్ బ్యూటీ శ్రీ లీల ప్రస్తుతం ఏకంగా తొమ్మిది సినిమాలలో అవకాశాలు దక్కించుకున్న విషయం తెలిసిందే. పెళ్లి సందD సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ధమాకా సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్ తో వచ్చిన అవకాశాన్ని వదులుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈమెకు ఏకంగా పాన్ ఇండియా సినిమా అల్లు అర్జున్ పుష్ప 2లో ఐటమ్ సాంగ్ కోసం అవకాశం వచ్చిందట. దర్శక నిర్మాతలు కూడా ఐటమ్ సాంగ్ కోసం శ్రీ లీలాను సంప్రదించినట్లు సమాచారం.

అయితే ప్రస్తుతం సోలో హీరోయిన్ గా బిజీగా మారిన ఈ ముద్దుగుమ్మ ఇలా ఐటమ్ సాంగ్ లో చేయడానికి ఇష్టపడలేదట. అందుకే అల్లు అర్జున్ సినిమా అయినా సరే నో చెప్పేసింది. ఇకపోతే స్టార్ హీరోకి ఈమె నో చెప్పడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికైతే అల్లు అర్జున్ కి నో చెప్పి శ్రీ లీలా పెద్ద సాహసమే చేసిందని చెప్పవచ్చు. మరి ఐటెం సాంగ్ లో ఎవరు నటించడానికి వస్తారో చూడాలి.