`బ్రో` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేతికి ఉన్న వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇల్లు కొనేయొచ్చు!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ `బ్రో` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు ఆయ‌న మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ను పోషించాడు. స‌ముద్ర‌ఖ‌ని డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కేతిక వ‌ర్మ‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోయిన్లుగా న‌టించారు. జూలై 28న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో బుక్సింగ్స్ ఊపందుకున్నాయి. థియేట‌ర్స్ వ‌ద్ద‌ మెగా ఫ్యాన్స్ సంద‌డి షురూ అయింది. మ‌రోవైపు మేక‌ర్స్ ప్ర‌చార‌కార్య‌క్ర‌మాల‌ను జోరుగా నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం శిల్పకళా వేదికలో బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అట్టహాసంగా నిర్వ‌హించారు. ఈ ఈవెంట్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పీచ్ బాగా హైలెట్ అయింది.

అయితే ఈ ఈవెంట్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేతికి పెట్టుకున్న‌ వాచ్ ధ‌రెంతో తెలిస్తే మైండ్ బ్లాకైపోతుంది. బ్రెగ్యుట్‌ మైరెన్‌ క్రోనోగ్రాఫ్ వాచ్ ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న చేతికి ప‌ట్టుకున్నాడు. ఈ బ్రాండెడ్ వాచ్ ధ‌ర ఎంతో తెలుసా.. అక్ష‌రాల రూ. 21,45,678. ఈ విష‌యం తెలిశాక నెటిజ‌న్లు క‌ళ్లు తేలేస్తున్నారు. ఆ వాచ్ ఖ‌రీదుతో ఒక ఇల్లు కొనేయొచ్చు అని కొంద‌రు అంటంటే.. ప‌వ‌ర్ స్టార్ రేంజ్ రేంజ్ అంటే ఆ మాత్రం ఉండాల‌ని మ‌రికొంద‌రు కామెంట్లు పెడుతున్నారు.