ఎన్టీఆర్- రాజీవ్ కనకాల మధ్య స్నేహం చేడిందా.. క్లారిటీ ఇచ్చిన రాజీవ్..!!

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటుడు రాజీవ్ కనకాల స్నేహం గురించి చెప్పాల్సిన పనిలేదు.. వీరిద్దరూ కూడా ఇండస్ట్రీలో మంచి స్నేహితులు అయితే ఇండస్ట్రీకి రాకముందే రాజీవ్ ఎన్టీఆర్ మంచి స్నేహితులట. టిడిపి ప్రచార సమయం లో కూడా ఎన్టీఆర్ పక్కనే ఉండేవారట రాజీవ్ కనకాల.. దీంతో వేరి స్నేహం మరింత బలపడింది అలాగే ఎన్టీఆర్ నటించే పలు చిత్రాలలో కూడా రాజీవ్ కనకాల ఏదో ఒక పాత్రలో కనిపిస్తూ ఉంటారు. వీరిద్దరూ కలిసి తెరపై కనిపించి ఇప్పుడు చాలా కాలం అవుతోంది.

Rajiv Kanakala reveals true color of Jr NTR

RRR వంటి సినిమాలు ఎన్టీఆర్ పాత్రకి వాయిస్ ఓవర్ ఇవ్వడంతో రాజీవ్ కనకాల పాత్ర ముగిసింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ అవ్వడానికి ఎక్కువ సమయం పట్టింది..రాజీవ్ కనకాల పలు చిత్రాలలో పలు పాత్రలలో నటించారు. అయితే గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్, రాజీవ్ కనకాల మధ్య స్నేహం చెడిందని ఇద్దరు పెద్దగా మాట్లాడుకోవడం లేదనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి..

ఈ విషయంపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల స్పందించడం జరిగింది.. ఎన్టీఆర్ తో స్నేహం అలాగే ఉంది ఆయనకు ఇప్పుడు కమిట్మెంట్ బాధ్యతలు చాలా అని పెరిగిపోయాయి.. ఇప్పుడంతా ఖాళీగా ఉండడం లేదు అందువల్లే ఈ మధ్య ఎన్టీఆర్ ని కలవలేదు..RRR చిత్రంలో ఆయన పాత్రని పరిచయం చేసింది నేనే ఆ మధ్యనే సెట్స్ రమ్మని కాల్ చేశాడు కానీ నేను వెళ్లలేదు.. నా బిజీలో నేను ఉండడం వల్ల వెళ్లలేకపోయాను అని తెలిపారు.. అంతకుమించి మా మధ్య ఏమీ లేదు తారక్ తర్వాత తరుణ్, మనోజ్ ,శివ బాలాజీ తో బాగా చనువుగా ఉంటానని తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.