బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య అదిరిపోయే యాక్టింగ్‌.. స్టార్ హీరోయిన్లు కూడా వేస్టే!

యూట్యూబ్‌లో ఎన్నో ఏళ్ల నుంచి నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరయింది వైష్ణవి చైతన్య. ఈ ముద్దుగుమ్మ ఈరోజు ‘బేబీ’ సినిమాతో హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన బేబీ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్ అశ్విన్ నటించారు. సినిమాలో విరాజ్ అశ్విన్, ఆనంద్ దేవరకొండ నటన కంటే వైష్ణవి నటనే అద్భుతంగా ఉందని ఆల్రెడీ మూవీ చూసేసినవారు రివ్యూస్ ఇచ్చేస్తున్నారు.

బేబీ సినిమా కమర్షియల్ గా కూడా మంచి హిట్ అందుకుంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా లో వైష్ణవి కాకుండా వేరే హీరోయిన్ నటిస్తే మాత్రం సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకునేది కాదు. ఫేస్‌లో సరిగా ఎక్స్‌ప్రెషన్స్ చూపించలేని ముంబై, ఢిల్లీ హీరోయిన్ల కంటే వైష్ణవి నటన 100 రెట్లు బెటర్ అని చెప్తున్నారు. ట్రెడిషన్ పాత్రలో వైష్ణవి అదగొట్టేసిందనే చెప్పాలి. దాంతో ప్రేక్షకులకు ఆమె నటనకు ఫిదా అయిపోతున్నారు.

రొటీన్ స్టోరీనే అయినా చాలా కొత్తగా చూపించాడు దర్శకుడు సాయి రాజేష్. ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ బూతులతో ఉన్నా కూడా సరైన సందర్భాన్ని బట్టి క్రియేట్ చెయ్యడంతో ఆ సీన్స్ కూడా ప్రేక్షకులను అల్లరిస్తున్నాయి. ఇక ఈ సినిమా తో ఆనంద్ దేవరకొండ కోరుకున్న భారీ సక్సెస్ దక్కడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా చాలా మంది కెరీర్స్‌ని మలుపుతిప్పుతుందని అర్థం అవుతుంది. మరి బేబీ సినిమా ఫుల్ రన్ లో ఎంత కలెక్షన్లు వసూలు చేస్తుందో చూడాలి.