చీప్ రీజ‌న్ తో `బేబీ` మూవీని రిజెక్ట్ చేసి ఇప్పుడు ఏడుస్తున్న హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ `బేబీ`. కలర్ ఫోటో చిత్రానికి రచయితగా జాతీయ పురస్కారం అందుకున్న సాయి రాజేష్ బేబీ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సాఫ్ట్‌వేర్ డేవ్‌లవ్‌పర్ వెబ్ సిరీస్‌తో యూట్యూబ్‌లో పాపులర్ అయిన తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య ఇందులో హీరోయిన్ గా న‌టిస్తే.. విరాజ్ అశ్విన్ కీల‌క పాత్ర‌ను పోషించాడు.

మాస్ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీ ఇది. నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం.. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. యూత్‌కి అందులోనూ టీనేజ్ వాళ్లకి ఈ సినిమా తెగ న‌చ్చేస్తుంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ వైష్ణ‌వి చైత‌న్య పాత్ర బాగా హైలెట్ అయింది. బ‌స్త్రీ అమ్మాయిగా, గ్లామ‌ర్ గాళ్‌గా లుక్స్ లోనే కాకుండా న‌ట‌న ప‌రంగానూ వేరియేష‌న్ చూపిస్తూ చించిపడేసింది. తొలి సినిమాలోనే మంచి స్కోప్ ఉన్న పాత్ర‌ను పోషించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

అసలు వైష్ణవి పాత్రకి ఈమెను తప్ప వేరొకర్ని ఊహించుకోలేం అంటే.. ఆమె ఎంత బాగా చేసిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. బేబీ మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ వైష్ణ‌వి చైత‌న్య కాదు. మొద‌ట హీరోయిన్ పాత్ర కోసం శ్రీ‌లీల‌ను మేక‌ర్స్ సంప్ర‌దించార‌ట‌. కానీ, ఆమె ఓ చీప్ రీజ‌న్ తో ఈ మూవీని రిజెక్ట్ చేసింద‌ట‌. చిన్న డైరెక్ట‌ర్‌.. పైగా త‌క్కువ బ‌డ్జెట్ మూవీ అని తెలిసి క‌థ విన‌కుండానే బేబీ మూవీని శ్రీ‌లీల రిజెక్ట్ చేసింది. ఇప్పుడు మూవీకి వ‌స్తున్న రెస్పాన్స్ చూసి.. అన‌వ‌స‌రంగా బేబీని వ‌దులుకున్నందుకు శ్రీ‌లీల‌ ఏడ‌స్తుంద‌ని ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది.