ఆ విషయంలో ఎన్టీఆర్ హీరోయిన్ పడిన కష్టం తెలిస్తే.. అయ్యో పాపం అంటారు!

ప్రముఖ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు హీరోయిన్‌గా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా కాలం అవుతుంది. కానీ ఇప్పటివరకు ఒక కమర్షియల్ బ్రేక్ కూడా దక్కించుకోలేకపోయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం జాన్వీ అందాలు ఆరబోస్తోంది. హాట్ పోజుల్లో, పొట్టి బట్టల్లో దిగిన ఫొటోలను షేర్ చేసి పిచ్చెక్కిస్తోంది. ఈ అమ్మడు హిందీలో చాలా సినిమాలే చేసినప్పటికీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. అయినా ఈ అమ్మడుకు ఆఫర్స్ తగ్గకపోవడం విశేషం.

 

ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర ‘ సినిమాలో నటిస్తోంది. దీనితో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. ఈ సినిమాలో కూడా జాన్వీ అందాల ఆరాబోత మాములుగా ఉండదట. జాన్వీ అందం వెనకున్న సీక్రెట్ నాలుగు గంటలు వర్క్ఔట్స్ చేయడమేనత. జాన్వీ కపూర్ తన ఫిజిక్ ని మెయింటైన్ చెయ్యడానికి అందరి హీరోయిన్స్ కంటే ఒక రెండు గంటలు ఎక్కువగా కష్టపడుతుందట.

అసలైతే హీరోయిన్స్ తమ ఫిజిక్ ని మెయింటైన్ చెయ్యడానికి రోజుకి రెండు గంటలు జిమ్ లో కష్టపడతారు. కానీ జాన్వీ మాత్రం తన ఫిజిక్ కోసం ఏకంగా నాలుగు గంటలు జిమ్ లో వర్క్ఔట్స్ చేస్తుందట. దాని బట్టి చూస్తే అర్ధం అవుతుంది జాన్వీ ఎంత కష్టపడుతుందో అని. అందరూ జాన్వీ అందం గురించి మాట్లాడుకుంటారు కానీ ఆ అందం కోసం ఆమె ఎంత కష్టపడుతుందో అని ఆలోచించరు. ఇప్పుడు జాన్వీ కష్టం తెలిసిన చాలా మంది ఆమెని ప్రశంసిస్తున్నారు.