ప్రి రిలీజ్ బిజినెస్ లో టాప్ -10 తెలుగు చిత్రాలు..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు మంచి మార్కెట్ ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా నటీనటులు దర్శకులకు కూడా కాంబినేషన్ సెట్ అయితే ఆ సినిమా మరింత హైప్ పెరుగుతూ ఉంటుంది. టాలీవుడ్ స్థాయి పెంచే ప్రయత్నాలు దర్శక నిర్మాతలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా చిత్రాలను సైతం విడుదల చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు అత్యధిక స్థాయిలో ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన టాప్ టెన్ సినిమాల గురించి తెలుసుకుందాం.

డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం RRR ఈ సినిమా అత్యధిక స్థాయిలో విడుదలకు ముందే మంచి డిమాండ్ ఏర్పరిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్ల రూపాయల రిలీజ్ బిజినెస్ జరిగింది. బాహుబలి సెకండ్ పార్ట్ తోని రాజమౌళి అప్పట్లో ఒక సెండ్ చేసిన క్రియేట్ చేశారు ఈ సినిమా మొదటి భాగం సక్సెస్ కావడంతో ఈ సినిమాకి ప్లస్ అయిందని చెప్పవచ్చు. బాహుబలి 2 ప్రి రిలీజ్ బిజినెస్ రూ.352 కోత రూపాయలు జరిగింది.

ప్రభాస్, సుజిత్ దర్శకత్వంలో వచ్చిన సాహో సినిమా టీజర్ పోస్టర్తోనే పాజిటివ్ వైబ్రేషన్ ని అందుకుంది. ఈ సినిమా విడుదలకు ముందు రూ.270 కోట్ల రూపాయలు ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇటీవల ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా కూడా అదే స్థాయిలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ రూ.240 కోట్ల మేరకు జరిగిందని టాప్ వినిపిస్తోంది. రాధే శ్యామ్ చిత్రం రూ.202 కోట్ల రూపాయల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. చిరంజీవి సైరా నరసింహారెడ్డి రూ.187 కోట్లు.. పుష్ప-1.. రూ.144 కోట్లు. ఆచార్య రూ.131 కోట్లు. మహేష్ స్పైడర్ రూ 124 కోట్లు. అజ్ఞాతవాసి రూ.123 కోట్ల రూపాయల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.