J.R ఎన్టీఆర్ వదులుకున్న బ్లాక్ బాస్టర్ సినిమాలు ఇవే..!!

టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో విజయాలను సైతం అందుకున్నారు. ఎన్టీఆర్ కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ మూవీలు పడడమే కాకుండా ఫ్లాప్ సినిమాలను కూడా చవిచూశారు. ఇటీవలే RRR చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మంచి పాపులారిటీ సంపాదించారు. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ .. ఎన్టీఆర్ కెరియర్లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేయడం జరిగింది. అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలుగా నిలిచినట్టు తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.

Junior NTR said something that hurt the fans, said - will stop making films

డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో , రవితేజ హీరోగా నటించిన చిత్రం కిక్ . ఈ సినిమాని ముందుగా ఎన్టీఆర్ కు వినిపించగా కామెడీ టైమింగ్ ఎక్కువగా ఉండడంతో ఎన్టీఆర్ రిజెక్ట్ చేసినట్లు సమాచారం. వివి వినాయక్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన చిత్రం దిల్. ఈ సినిమాలో ఎక్కువగా మాస్ పాత్రలు ఉండడంతో రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం ఆర్య. అప్పటికే లవ్ చిత్రాలలో నటించిన ఎన్టీఆర్ ఈ సినిమాని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Jr NTR rejected 6 Block Buster movies List | For Latest Information

రవితేజ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన భద్ర సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్ డేట్స్ ఖాళీగా లేక ఈ సినిమాని రిజెక్ట్ చేసినట్లు సమాచారం. శ్రీమంతుడు మహేష్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కనిపించిన చిత్రం . డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా స్టోరీ నచ్చక ఎన్టీఆర్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా కృష్ణ, అతనొక్కడే ,ఎవడు ,ఊపిరి, వంటి చిత్రాలను రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాలని అందుకున్నాయి.