దుమ్ము రేపుతోన్న మంగళవారం టీజర్.. భయపెట్టేస్తోన్న పాయల్..!

ప్రముఖ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె అదే సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ కలిసి చేస్తున్న కొత్త సినిమా మంగళవారం. టైటిల్ పోస్టర్ తోనే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో పాయల్ బోల్డ్ లుక్ లో కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఇక తాజాగా ఫియర్ ఇన్ ఐస్ అనే పేరుతో ఒక టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు.. ఇక ఈ టీజర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆసక్తిగా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక ఈ చిత్రం చూస్తుంటే మనకు క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

 

పొలాల మధ్య సీతాకోకచిలుకలు గుండ్రంగా ఎగరడంతో మొదలైన ఈ టీజర్ లో మొదట ఒక అమ్మవారి ఆలయాన్ని చూపించడం ఆ తర్వాత అందరూ ఏం జరగబోతోందా అన్న భయంతో పైకే చూస్తున్నట్లుగా మనకు ఈ టీజర్ లో కనిపిస్తారు. ఇక ప్రతి షార్ట్ లో కూడా అందరి కళ్ళను హైలైట్ చేస్తూ వారందరూ భయంతో చూస్తున్నట్లుగా చూపించడం టీజర్ కే హైలెట్గా నిలుస్తుంది బోల్డ్ అండ్ సీరియస్ ఎమోషనల్ షాట్స్ను డైరెక్టర్ కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇకపోతే ఏడుస్తూ కోపంతో అరుస్తున్నట్టుగా హీరోయిన్ ని చూపించారు కానీ అందులో ఆమె పాత్ర ఏమిటి అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంచారు.

 

ఇక టీజర్ చివరికి వచ్చేసరికి ఎవరో ఒక వ్యక్తి ముఖానికి అమ్మవారి మాస్క్ వేసుకోవడం చాలా ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది. ఇక ఆ వ్యక్తి ఎవరు అన్నది కూడా రివీల్ చేయలేదు. ఇక ఈ సినిమాకి కాంతారావు ఫేమస్ లోకనాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా హైలెట్ గా నిలిచింది. థియేటర్లలో ఈ మ్యూజిక్ కచ్చితంగా గూస్ బంప్స్ తెప్పిస్తుందని సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే పాయల్ ఈ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమయ్యిందని చెప్పవచ్చు.