రెడ్ డ్రెస్ లో మిల్కీ బ్యూటీ స్పైసీ లుక్స్‌.. కుర్రాళ్ల‌కు ఫుల్ మీల్స్‌ పెట్టేసిందిగా!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా త్వ‌ర‌లోనే రెండు సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది. అందులో `భోళా శంక‌ర్‌` ఒక‌టి. చిరంజీవి హీరోగా మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. ఇందులో త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తే.. కీర్తి సురేష్‌, సుమంత్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఆగ‌స్టు 11న ఈ సినిమా విడుద‌ల కాబోతోంది. స‌రిగ్గా ఒక్క రోజు ముందు అంటే ఆగ‌స్టు 10న త‌మ‌న్నా న‌టించిన మ‌రో సినిమా రిలీజ్ కానుంది.

అదే `జైల‌ర్`. సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మింస్తున్న ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్‌ దర్శకత్వం వహించాడు. శివరాజ్‌కుమార్‌, మోహన్ లాల్, రమ్యకృష్ణ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ చిత్రం త‌మిళంతో పాటు తెలుగులో కూడా విడుద‌ల కానుంది. అయితే త‌మ‌న్నా ఈ రెండు సినిమాల ప్ర‌మోష‌న్స్ లో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైంది.

ఈ నేప‌థ్యంలోనే మొద‌ట జైల‌ర్ ప్ర‌మోష‌న్స్ ను షురూ చేసింది. రీసెంట్ గా ‘జైలర్’ ఆడియో లాంచ్ ను నిర్వ‌హించ‌గా.. ఆ ఈవెంట్ లో త‌మ‌న్నా స్పెష‌న‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచింది. రెడ్ డ్రెస్ లో స్పైసీ లుక్స్ తో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. త‌న అందాల‌తో కుర్రాళ్ల‌కు ఫుల్ మీల్స్ పెట్టేసింది. త‌మ‌న్నా లేటెస్ట్ హాట్ పిక్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)