మ‌హేష్ బాబును త‌లెత్తుకునేలా చేసిన సితార‌.. తెగ మురిసిపోతున్న సూప‌ర్ స్టార్‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గార‌ల ప‌ట్టి సితార ఘట్టమనేని గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చిన్న‌త‌నం నుంచే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటున్న ఈ చిన్నారి.. అంద‌మైన ఫోటోషూట్లు, వెకేష‌న్ వీడియోల‌తో పాటు డ్యాన్స్ వీడియోల‌ ద్వారా బాగా పాపుల‌ర్ అయింది. అలాగే సితార ఓ యూట్యూబ్ ఛానెల్‌ను కూడా రన్‌ చేస్తుంది.

తాజాగా సితార ఓ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకుని తండ్రిని త‌లెత్తుకునేలా చేసింది. ప్రతిష్టాత్మక జ్యువెలరీ బ్రాండ్ పిఎంజె జ్యువెలరీకి సితార‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా అయిన సంగ‌తి తెలిసిందే. పిఎంజె జ్యువెలరీ బ్రాండ్ ప్ర‌మోష‌న‌ల్ యాడ్ ను ఇటీవ‌లె షూట్ చేశారు. ఈ యాడ్ కోసం సితార మూడు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంది.

అయితే ఇప్పుడు ఈ యాడ్‌కు సంబంధించిన ఫొటోల‌ను ‘సితార కలెక్షన్స్‌’ పేరుతో అమెరికాలోని న్యూయార్క్‌ సిటీలో ప్రఖ్యాత టైమ్‌ స్వ్కేర్‌పై ఆవిష్కరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. మ‌హేష్ బాబు సైతం త‌న కూతురు సాధించిన ఘ‌న‌త‌ను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంటూ తెగ మురిపిపోయాడు. ఇక లిటిల్‌ ప్రిన్సెస్‌ యాడ్‌ను టైమ్‌ స్వ్కేర్‌పై చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తండ్రికి త‌గ్గా కూతురు అంటూ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)