శ్రీ విష్ణు `సామజవరగమన`, నిఖిల్ `స్పై`.. ఈ రెండు చిత్రాలు జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సామజవరగమన వియానికి వస్తే.. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా నిర్మించిన ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. శ్రీవిష్ణు , రెబా మోనికా జాన్ ఇందులో జంటగా నటించారు. అవుట్ అండ్ అవుడ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకుని బాక్సాఫీస్ వద్ద ఎక్స్ లెంట్ కలెక్షన్స్ రాబడుతోంది.
విడుదలైన నాలుగు రోజుల్లోనే లాభాల బాట పట్టిన సామజవరగమన.. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రూ. 4.27 కోట్ల షేర్, రూ. 7.50 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది. అలాగే వరల్డ్ వైడ్ గా రూ.6.32 కోట్ల షేర్, రూ. 11.95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. రూ. 3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా.. ఏకంగా రూ. 2.82 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దూసుకుంది.
ఇక నిఖిల్ స్పై విషయానికి వస్తే.. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. కానీ, థ్రిల్ చేసే అంశాలు లేకపోవడం వల్ల ఈ చిత్రానికి నెగటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఉన్నంతలో వసూళ్లను బాగానే రాబడుతోంది. ఐదు రోజుల్లోతెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రూ. 7.33 కోట్ల షేర్, రూ. 12.00 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది. అలాగే వరల్డ్ వైడ్ గా రూ.10.26 కోట్ల షేర్, రూ. 16.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. రూ. 16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే ఇంకా రూ. 6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంది.