పెళ్లి చేసుకోకపోడానికి అసలు కారణమేంటో తెలిపిన సదా.. అయ్యో పాపం అంటున్న ఫ్యాన్స్!

జయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ సదా గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తన మొదటి సినిమాతోనే మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తన నటన, అందంతో జయం సినిమా తరువాత వరుస అవకాశాలు అందుకుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. ఇక తమిళంలో హీరో విక్రమ్ తో జతకట్టి ‘అపరిచితుడు’ సినిమాతో సూపర్ హిట్ గా తన ఖాతాలో వేసుకుంది. దాంతో ఇండస్ట్రీలో సదా పేరు మార్మోగిపోయింది.

కానీ ఆ తర్వాత నుండి అవకాశాలు రావడం తగ్గిపోయాయి. ఆ క్రమంలోనే ఇండస్ట్రీ నుంచి కనుమరుగయిపోయింది. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మరోసారి తన సత్తా చాటుకోవాలని చూస్తుంది. అయితే ఈసారి సినిమాలతోనే కాకుండా కొన్ని టీవీ షోలలో జడ్జ్ గా వ్యవహరించి ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ అమ్మడు బుల్లితెర, వెండితెరపైనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటు రకరకాల ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో సదాకి మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.

ఇదంతా పక్కన పెడితే 30 ఏళ్ల వయసు వచ్చినా కూడా సదా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. తను పెళ్లి చేసుకోక పోవడానికి గల కారణాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. సదా మాట్లాడుతూ ‘పెళ్లి చేసుకోలేదు కాబట్టే చాలా సంతోషంగా ఉన్నాను. ప్రస్తుతం నాకు కావలసినంత ఫ్రీడం ఉంది. నాకు జంతువులు అంటే చాలా ఇష్టం. వాటిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాను. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ నా లైఫ్ లో ఉంటాయో ఉండవో తెలీదు. కొంతమంది మనల్ని అర్థం చేసుకుంటారు కొంతమంది అర్థం చేసుకోరు. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో చాలామంది పెళ్లి చేసుకొని విడిపోతున్నారు. అలా విడిపోవడం కంటే పెళ్లి చేసుకోకపోవడమే బెటర్’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే వీటి గురించే తన పెళ్లి చేసుకోవడం లేదని సదా చెప్పడంతో అయ్యో పాపం అని చాలామంది అంటున్నారు.