రెండవ పెళ్లి చేసుకోబోతున్న రజనీకాంత్ కూతురు..ఆ స్టార్ హీరోనేనా..?

కోలీవుడ్ లో కాని బాలీవుడ్ లో కానీ టాలీవుడ్ లో కానీ ఎటు చూసినా విడాకుల విషయాలే హల్చల్ అవుతున్నాయి. నటీనటుల సైతం ఎంతో ప్రేమించుకుని పెళ్లి చేసుకోని ఏదో చిన్న చిన్న పొరపాట్ల వల్ల విడాకులు తీసుకొని చాలా పెద్దతప్పు చేస్తున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోకుండా రాజీ అవ్వకుండా వెంటనే విడాకుల వైపు మగ్గుచూపుతున్నారు. అంతగా ప్రేమించుకుని పెళ్లి చేసుకోని ఇలా చేయడం ఏంటో అభిమానులకు అర్థం కావడం లేదు.

గత నెలల క్రితం తమిళ హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ వీరిద్దరూ కూడా విడాకులు తీసుకోవడం జరిగింది. ఐశ్వర్య రజినీకాంత్ కూతురు అన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి చేసుకొని అన్యోన్యంగా ఉంటూనే ఉన్నట్టుండి విడాకులు తీసుకోవడం జరిగింది.అంతేకాకుండా వీరికి చెట్టంతా కొడుకులు కూడా ఉన్నారు. అయినా కానీ ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నారో అర్థం కావడం లేదు. ధనుష్ కి కెరీర్ ప్రారంభంలో రజినీకాంత్ బ్రాండ్ చాలా బాగా పనిచేసింది. వీరిద్దరూ మామ అల్లుళ్ళ లాగా ఎప్పుడు కనిపించరు.. తండ్రి కొడుకుల కనిపించేవారు. ధనుష్ తన కూతురిని కలపటానికి రజినీకాంత్ చాలా ప్రయత్నాలు కూడా చేసి విఫలమయ్యాడు.

Dhanush, Aishwarya Rajinikanth seen together in public for the first time  since separation, attend son Yathra's school event. See photo |  Entertainment News,The Indian Express

లేటెస్ట్ గా ఐశ్వర రజనీకాంత్ పై వినిపిస్తున్న ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోంది.. ఐశ్వర్య రజినీకాంత్ ఒక కోలీవుడ్ యంగ్ హీరోతో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు పిల్లల తల్లి అయినా ఐశ్వర్య ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంటుందా అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.ఒకవేళ ఐశ్వర్య ప్రేమించి పెళ్లి చేసుకుంటే రజనీకాంత్ ఫ్యాన్స్ పాజిటివ్గా తిసు కుంటారా.. నెగిటివ్గా అనుకుంటారా అన్న విషయానికి వస్తే ఎంతో మంది మగవాళ్లు చేసుకున్నప్పుడు ఆడవాళ్లు ఎందుకు చేసుకోకూడదు అంతేకాకుండా ఆడవాళ్లకు తోడుగా నీడగా ఉండాలి కాబట్టి తప్పేమీ లేదు అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.