ప్రాజెక్ట్-K చిత్రంపై ప్రభాస్ ట్విట్ వైరల్..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రాలలో ప్రాజెక్ట్-K చిత్రం కూడా ఒకటి.ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కిస్తూ ఉన్నారు.. ఇందులో అమితాబచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని ,కమలహాసన్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రాజెక్ట్ -K గురించి కొన్ని రకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా ప్రభాస్ కూడా ఒక ట్విట్ చేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.

Project K': Makers offer FREE merchandise of Prabhas, Deepika Padukone's film for fans - India Today

ప్రాజెక్ట్-K అంటే ఏమిటి అనే విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.. ఇందుకు సమాధానం చెప్పేందుకు మేము సిద్ధమయ్యాము అందుకు రెడీగా ఉండండి జులై 20వ తేదీన యూఎస్ఏ లో కామిక్ కాన్ సాన్ డియోగోలో అదేంటో తెలుసుకోండి అంటే ప్రభాస్ ట్వీట్ చేయడం జరిగింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపుగా రూ .500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. జనవరి 12 వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమాతో పాటు ప్రభాస్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా ఏడాది సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.ఈ సినిమా కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా రూ .200 కోట్ల రూపాయల బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు .ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటించిన మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తూ ఉన్నారు. జగపతిబాబు కూడా నటిస్తూ ఉన్నారు.