గురువుగారిని ఉద్దేశిస్తూ పూనమ్ కౌర్ సంచలన పోస్ట్..!!

టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. గతంలో ఎన్నో చిత్రాలలో నటించి తన అందంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ విషయంలో ఎప్పుడు వైరల్ గా మారుతూనే ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదం లేపేలా పోస్ట్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా పూనమ్ కౌర్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక స్టోరీ షేర్ చేయడం జరిగింది ప్రస్తుతం అది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.

Tollywood Actress Poonam Kaur Suffering From Unusual Health Problem

నిన్నటి రోజున గురు పౌర్ణమి సందర్భంగా ఆమె ఒక స్టోరీని షేర్ చేయడం జరిగింది. ఇక ఈ స్టోరీలో..”ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను.. రామ్ డిక్ అండ్ హరి అని ప్రతి ఒక్కరిని గురువు అని పిలవద్దని నీతులు చెప్పి స్టేజి మీద జీవితాలతో ఆడుకునే వాడు గురువు కాదు మీకు దారి చూపించేవారు గురువు అవుతారని ఆమె రాచకొచ్చింది”. పూనమ్ కౌర్ ఎవరి జీవితం గురించి ఇలా స్టోరీ షేర్ చేసిందో కానీ.. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ స్టోరీ పైన పలు రకరకాలుగా వార్తలయితే వినిపిస్తున్నాయి.

షేర్ చేసిన కొన్ని క్షణాల్లోనే ఈ ఫోటో వైరల్ గా మారడంతో అభిమానులు సైతం పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం ఒక టాలీవుడ్ హీరోని ఉద్దేశించే పూనమ్ కౌర్ ఇలా వాక్యాలు చేసి ఉంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా పూనమ్ కౌర్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.