పవన్ కళ్యాణ్ పై మరొకసారి షాకింగ్ కామెంట్స్ చేసిన బండ్ల గణేష్..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి నటుడు బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ ని దేవుడు అంటూ తాను భక్తుడిగా ఉన్నానంటు తెలియజేస్తూ ఉంటారు. అయితే గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ ,బండ్ల గణేష్ మధ్య దూరం బాగా పెరిగిపోయిందని వార్తలు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా గురుపౌర్ణమి సందర్భంగా గురువు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

Mission Pawan Kalyan for Bandla Ganesh

మా గురువుకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు మీరు ఎప్పుడూ ఇలాగే ఉండాలి కృషితో మీరు అనుకున్నవన్నీ సాధించాలి మీ స్థానం..స్థాయి తెలిసిన వాడిగా చెబుతున్నాను ఏ విధంగానైనా సరే మీరు కీర్తిని వాడుకొని లబ్ధి పొందను వీలైనంతవరకు సహాయం చేస్తూనే ఉంటాను ..లేకపోతే దూరంగానే ఉంటానని తెలియజేశారు.. అంతేకానీ మీ పేరుతో ఎలాంటి లబ్ధి పొందను నా ఆశ ఒక్కటే మీ ఆశయం నెరవేరాలని మీ మనసు లాగే మీరు కూడా పది కాలాలపాటు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఒక ట్విట్ చేశారు.

 

బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్ ఏ ఉద్దేశంతో చేశారంటూ పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ బ్రాండ్ ను ఉపయోగించుకొని ఏదైనా వ్యక్తిగత లబ్ధి పొందారా వాటికి వివరణ గాని ఇలా స్పందించారా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా అవసరమైతే పవన్ కళ్యాణ్ నుంచి దూరంగా ఉంటానని కూడా కామెంట్లు చేయడంతో ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. గతంలో పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ కాంబినేషన్లో గబ్బర్ సింగ్ సినిమా తెరకెక్కించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.