ఇండస్ట్రీలో కాజల్ బెస్ట్ ఫ్రెండ్స్ విరేనట..!!

టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు. దాదాపుగా తన సినీ కెరియర్లో ఎన్నో సంవత్సరాలు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. వివాహమై ఒక బిడ్డకు తల్లి అయినప్పటికీ కూడా పలు అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. అయితే కాజల్ అగర్వాల్ కి ఇండస్ట్రీలో కొంతమంది స్నేహితులు ఉన్నారట.వాటి గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

Kajal Aggarwal Feels “Hindi Cinema Lacks Ethics & Values” As She Chooses  South Industry Over Bollywood: “I Prefer The Eco-System”

సోషల్ మీడియాలో తనకు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ ఉంటుంది కాజల్ అగర్వాల్.. తాజాగా అభిమానులతో ముచ్చటించిన కాజల్ అగర్వాల్ అందులో ఒక నెటిజన్ ఇండస్ట్రీలో మీకు ఉన్న మంచి స్నేహితులు ఎవరు అని అడగగా.. కాజల్ అగర్వాల్ అందుకు సమంత, తమన్నా, రకుల్ ప్రీతిసింగ్ తన బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ బదులిచ్చింది. మేమంతా తరచూ ఎక్కువగా ఫోన్లో మాట్లాడుకుంటాము ఎవరి సినిమా రిలీజ్ అయిన ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటామని ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటామని తెలియజేసింది. అందరిలాగానే మేము కూడా ముచ్చట్లు పెట్టుకుంటామని తెలియజేసింది.. ఉపాసన కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అని అప్పుడప్పుడు గెట్ టుగెదర్ పార్టీలు వంటివి కూడా చేసుకుంటామని మా పార్టీలోకి మహేష్ భార్య కూడా ఎంట్రీ ఇస్తూ ఉంటుందని తెలిపింది.

 

Samantha Akkineni, Rakul Preet, Kajal Aggarwal and Tamannaah Bhatia pick  'The Avengers' Tamil cast

ప్రస్తుతం కాజల్ అగర్వాల్, బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి అనే చిత్రంలో నటిస్తోంది.అలాగే సత్యభామ అనే ఒక లేడీ ఓరియంటెడ్ చిత్రంలో పోలీస్ అధికారిగా కనిపించబోతోంది. ఇక వ్యక్తిగత జీవితంలోను ఇట సినీ జీవితంలో కూడా ఫ్యామిలీ లైఫ్ తో బాగా ఎంజాయ్ చేస్తోంది కాజల్ అగర్వాల్. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కి సంబంధించి ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.