వెన్నులో వణుకు పుట్టిస్తున్న పొలిమేర -2 సినిమా టీజర్..!!

2021లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో విడుదలై మా ఊరి పొలిమేర చిత్రం మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది .దీంతో ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా క్షుద్ర పూజలు ,తంత్రాలు వంటి వైవిధ్య కదా అంశంతో తెరకెక్కించడం జరిగింది అనిల్ విశ్వనాథ్.. ఇందులో సత్యరాజ్, బాలాదిత్య ,గెటప్ శ్రీను ,సాహితీ దాసరి, కామాక్షి ప్రధాన పాత్రలో నటించడం జరిగింది. గత కొద్దిరోజులుగా పొలిమేర-2 సినిమా పోస్టర్లతో అప్డేట్ అందిస్తున్న తరుణంలో నిన్నటి రోజున ఈ సినిమా టీజర్ ని కూడా విడుదల చేయడం జరిగింది చిత్ర బృందం.

Maa Oori Polimera 2 Teaser Launch By Varun Tej | Kamakshi Bhaskarla | Satyam Rajesh | iDream - YouTube

ఈ సినిమా టీజర్ ఒళ్ళు గుగురుపించే సన్నివేశాలు ఉండడంతోపాటు మొదటి భాగాన్ని మించిపోయేలా పార్ట్ 2 ఉన్నట్లుగా టీజర్ను చూస్తే మనకు అర్థమవుతోంది. టీజర్ మొత్తం ఉత్కంఠ బరిచేలా కనిపించడం మే కాకుండా చివరిలో ప్రాణం తీసిన తప్పు కాదు మామ అని అడగగా ప్రాణం తీసుడు తప్పే కానీ భలిస్తే తప్పేంటి అంటూ డైలాగ్ చెప్పడం హైలైట్ గా నిలుస్తోంది.. సత్యం రాజేష్ క్షుద్ర పూజలు చేస్తూ తల పైన రక్తం పోసుకుంటున్న దృశ్యాలు అందరిని భయపెట్టేలా కనిపిస్తున్నాయి.

ఈ సినిమా టీజర్ ని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లాంచ్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ సత్య రాజేష్ నాకు మంచి మిత్రుడు ott లో తను నటించిన మా ఊరి పొలిమేర చూశాను నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నాను.. ఈ సినిమా టీజర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందంటూ తెలిపారు. ఇక డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో టీవీల ప్రసారమైన ఒక రియల్ ఇన్సిడెంట్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమా కథ రాసుకున్నానని తెలిపారు.. గ్రామీణ కథ కాబట్టి క్యారెక్టర్ని బట్టి బోల్డ్ డైలాగ్స్ ఉంటాయి తప్ప ఎక్కడ కూడా కావాలని ఏది పెట్టలేదని తెలిపారు.