శ్రీ‌లీల‌కు గ‌ట్టి పోటీ ఇస్తున్న ముంబై బ్యూటీ.. మిగిలిన వారంతా సుద్ద వేస్టే!

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో శ్రీ‌లీల హ‌వా ఏ రేంజ్ లో ఉందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. వ‌చ్చిన రెండేళ్ల‌కే ఈ బ్యూటీ తెలుగులో మోస్ట్ వాంటెడ్ గా మారింది. యంగ్ హీరోలే కాదు టాలీవుడ్ టాప్ హీరోలు సైతం త‌మ‌కు శ్రీ‌లీలే కావాల‌ని గోల చేస్తున్నారు. శ్రీ‌లీల చేతిలో ఇప్పుడు ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది సినిమాలు ఉన్నాయి అంటే ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. శ్రీ‌లీల దెబ్బ‌కు ర‌ష్మిక‌, పూజా హెగ్డే, స‌మంత వంటి అగ్ర హీరోయిన్లు సైతం వ‌ణికిపోతున్నారు.

ఇలాంటి త‌రుణంలో శ్రీ‌లీల‌కు ఒకే ఒక్క హీరోయిన్ గ‌ట్టి పోటీ ఇస్తోంది. ఇంత‌కీ ఆమె మ‌రెవ‌రో కాదు ముంబై బ్యూటీ మృణాల్ ఠాకూర్‌. గ‌త ఏడాది విడుద‌లైన సీతారామం మూవీతో మృణాల్ ఓవ‌ర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది. ప్ర‌స్తుతం మృణాల్ సౌత్ తో పాటు నార్త్ లోనూ బిజీ హీరోయిన్ గా మారుతోంది. ముఖ్యంగా టాలీవుడ్ లో శ్రీ‌లీల పోటీని త‌ట్టుకుని నిల‌బ‌డుతున్న ఏకైక హీరోయిన్ మృణాల్ ఒక్క‌టే. మిగిలిన వారంతా వేస్టే అని అంటున్నారు. శ్రీ‌లీల వ‌ల్ల ఆఫ‌ర్ల లేక ర‌ష్మిక‌, పూజా హెగ్డే వంటి వారు ఇత‌ర భాష‌ల వైపు చూస్తుంటే.. మృణాల్ మాత్రం టాలీవుడ్ లో వ‌రుస అవకాశాల‌ను అందుకుంటోంది.

ఆల్రెడీ న్యాచుర‌ల్ స్టార్ నానికి జోడీగా ఓ సినిమా చేస్తోంది. అలాగే విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ప‌రుశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు క‌మిట్ అయింది. ఇక గేమ్ ఛేంజ‌ర్ అనంత‌రం రామ్ చ‌ర‌ణ్ `ఉప్పెన‌` ఫేమ్ బుచ్చిబాబు డైరెక్ష‌న్ లో ఓ పాన్ ఇండియా మూవీ చేయ‌నున్నాడు. ఈ చిత్రంలోనూ మృణాల్ హీరోయిన్ గా ఎంపిక అయింద‌ని అంటున్నారు. అలాగే రెమ్యున‌రేష‌న్ కూడా గ‌ట్టిగానే ఛార్జ్ చేస్తోంది. ఒక్కో సినిమాకు రూ. 5 నుంచి 6 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ అందుకుంటోంది.