కాబోయే భర్త ని పరిచయం చేసిన హెబ్బా పటేల్..!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ సైతం ఎలాంటి విషయాలను కూడా దాచకుండా వెంటనే అభిమానులతో పంచుకోవడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా బాయ్ ఫ్రెండ్, వివాహ విషయం, ప్రెగ్నెంట్ విషయాన్ని ఏమాత్రం దాచకుండా చూస్తున్నారు. కొంతమంది హీరోయిన్లు ఇలా డేర్ చేయలేకపోతున్నారు. మరి కొంత మంది హీరోయిన్లు మాత్రం ధైర్యంగా ముందుకు వస్తూ చెబుతున్నారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా హీరోయిన్ హెబ్బా పటేల్ లవర్ అంటూ ఒక వ్యక్తి ఫోటోని షేర్ చేయడం జరిగింది.

Hebah Patel to go de-glam for her next film Odela Railway Station | Telugu  Movie News - Times of India

అసలు విషయంలోకి వెళ్తే టాలీవుడ్ లో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించిన హెబ్బా పటేల్ యంగ్ హీరోలతో మాత్రమే నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. కుమారి 21ఎఫ్ చిత్రం ద్వారా క్రేజీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించింది. అయితే ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన హెబ్బా పటేల్ పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల హాట్ ఫోటోలను సరిత షేర్ చేస్తూనే ఉంటుంది.

హెబ్బా పటేల్ ఎప్పుడూ కూడా హాట్ లుక్ లోనే కనిపిస్తూ ఉంటుంది. సినిమాలలో అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో అభిమానులకు టచ్ లోనే ఉంటుంది అప్పుడప్పుడు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది హెబ్బా పటేల్. హెబ్బా పటేల్ తన ఇంస్టాగ్రామ్ లో లవర్ అంటూ ఒక వ్యక్తి ఫోటో పంచుకోవడం జరిగింది ఇక అతడిని హగ్ చేసుకోగా అతని ముఖం కనిపించకుండా కవర్ చేసింది. ఈ ఫోటో చూసిన వారంతా హెబ్బా పటేల్ డేర్ కి సైతం షాక్ అవుతున్నారు. మరి అతను నిజంగానే హెబ్బా పటేల్ లవరా లేకపోతే సరదాగా అలా పెట్టిందా అనే విషయం తెలియాల్సి ఉన్నది.

 

View this post on Instagram

 

A post shared by Hebah P (@ihebahp)