ఎంత లవర్ అయితే మాత్రం తమన్నాని అంత మాట అనేస్తాడా.. విజయవర్మపై ట్రోలింగ్!

ప్రముఖ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ మిల్క్ బ్యూటీ ఇటీవల కాలంలో బాగా ట్రెండింగ్ లో ఉంటుంది. నటుడు విజయ్‌తో ఈ అమ్మడి రిలేషన్ ముద్దుల నుంచి మొదలుపెట్టి వెబ్ సిరీస్ లో వీరిద్దరూ చెలరేగిపోయేవరకు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఉన్న ప్రాజెక్టులు తక్కువే అయినప్పటికీ వార్తల్లో మాత్రం ఎక్కువగా నిలుస్తుంది. విజయ్ వర్మ , తమన్నాలపై వస్తున్న వార్తలకు తగ్గట్టుగా తమన్నా డాన్స్ గురించి విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

ఈమధ్య సినిమాలు, వెబ్ సిరీస్‌లు అంటూ బిజీగా ఉన్న తమన్నా, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ ‘ సినిమాలో నటిస్తుంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ‘కావాలా…’ అనే లిరికల్ పాటని విడుదల చేసారు. ఈ పాటకి తమన్నా ఊర మాస్ స్టెప్పులతో ఇరగదీసింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ఫుల్ ట్రెండింగ్ అవుతుంది. చాలామందికి ఈ పాట బాగా నచ్చింది. ఇక తమన్నా విషయానికి వస్తే గత ఏడాది వరకు సింగిల్ గా ఉన్న ఈ మిల్కీ బ్యూటీ ప్రస్తుతం నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉంది.

విజయ్ వర్మ,తమన్నా కలిసి నటించిన ‘లస్ట్ స్టోరీస్ 2 ‘సినిమా ఇటీవలే విడుదల అయింది. దాంట్లో వీరిద్దరూ ముద్దులతో, శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయారు. జైలర్ సినిమా నుండి విడుదలైన ‘కావాలా… ‘ అనే పాట చూసినా విజయ్ ఫిదా అయిపోయాడట. దాంతో ‘పాట ఫైర్ పుట్టిస్తుంది. సినిమా దేవుడు, దేవత’ అంటూ రాస్కొచ్చాడు. అంటే విజయ్ వర్మ మాటల్ని బట్టి జైలర్ సినిమా దేవుడు రజినీకాంత్ అని అర్థం. అంతవరకు బానే ఉంది కానీ తమన్నాను మాత్రం దేవత అని అనటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎంత గర్ల్ ఫ్రెండ్ అయితే మాత్రం మరి అంతలా పొగడాలా అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.