ఆ స్టార్ హీరోతో నటించడమే నా డ్రీమ్.. మృణాల్ ఠాగూర్ కామెంట్స్..!!

బాలీవుడ్ సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన నటి మృణాల్ ఠాకూర్ వెండితెరపై ఒక వెలుగు వెలుగుతోందని చెప్పవచ్చు. టాలీవుడ్ లోకి మొదటిసారిగా సీతారామం చిత్రం ద్వారా పరిచయమై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించుకుంది మృణాల్ ఠాకూర్. ఈ సినిమా సక్సెస్ కావడంతో తెలుగులో వరుసగా అవకాశాలు వెలుపడ్డాయి నాని సరసన 30వ చిత్రంలో నటించే అవకాశాన్ని కూడా అందుకుంది.

ఇది కాకుండా నటుడు విజయ్ దేవరకొండ తో కలిసి కూడా ఒక సినిమాలో నటించేందుకు మృణాల్ ఠాకూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది. తన గ్లామర్ ఫోటోలతో కుర్రకారులను మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మనసులోని కోరికను కలను బయట పెట్టడం జరిగింది.

మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ ఏమి ఇండస్ట్రీలకు అడుగుపెట్టినప్పటి నుంచి తనకు ఒక పెద్ద కోరిక ఉందని ఆ కోరిక గురించి ప్రతిరోజు కలకంటూనే ఉన్నానని తెలియజేసింది.. తాను ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటి నుంచి మహేష్ బాబుతో నటించాలని కోరిక ఉన్నట్లు తెలియజేసింది. అయితే ఆయనతో కలిసి నటించే అవకాశం కోసం ప్రతిరోజు ఎదురుచూస్తున్నాను ఆ కోరిక నెరవేరాలని త్వరలోనే కోరుకుంటున్నారని తెలిపింది. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఉన్న సినిమాలు సక్సెస్ అయితే ఈమె ఖాతాలో మహేష్ సినిమా పడుతుందని అభిమానులు భావిస్తున్నారు.