జబర్దస్త్ వర్ష ఇంత అందంగా వుంటుందా అని కుర్రకారు కళ్ళార్పకుండా చూస్తున్నారు?

అవును, జబర్దస్త్ వర్ష ఇంత అందంగా వుంటుందా అని కుర్రకారు కళ్ళార్పకుండా చూస్తున్నారు. విషయం ఏమంటే ఆమె లేటెస్ట్ ఫోటో పిక్స్. ఆమె సోషల్ మీడియాలో పింక్ కలర్ టాప్ లో కలర్ఫుల్ గా దర్శనమిచ్చింది. వేడి వేడిగా అందాలు వడ్డిస్తూ కుర్రాళ్లను గట్టిగా వురించింది. పూలలో పూవుగా వర్ష అందంతో కట్టిపడేసిందని మనోళ్లు కామెంటల్స్ వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా మధ్య మధ్యలో వంగి వంగి పరువాల ప్రదర్శన చేసింది. గతంతో పోల్చుకుంటే వర్ష ఫేమ్ బాగా పెరిగింది. అటు లేడీ కమెడియన్ గా ఇటు సోషల్ మీడియా గ్లామర్ క్వీన్ గా బాగా వెలుగొందుతోంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పాపులర్ కామెడీ షోల్లో వర్ష దుమ్ముదులుపుతున్నారు.

వర్ష సీరియల్ నటిగా కెరీర్ ఆరంభించిన సంగతి విదితమే. అయితే అక్కడ వర్షకు ఎలాంటి గుర్తింపు రాలేదు. దాంతో ఆమె జబర్దస్త్ వేదికపైన మెరిసింది. ఆ షో ఆమెని ఓవర్ నైట్ స్టార్ చేసింది. వర్ష ఫేవరేట్ లేడీ కమెడియన్ గా మారిపోయారు. జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ తో లవ్ ట్రాక్ కూడా వర్షకు కలిసొచ్చింది. తెలివిగా వర్ష తనని తాను ఇమ్మానియేల్ లవర్ గా ప్రేక్షకులకు పరిచయం చేసుకుంది. మరో వైపు ఇమ్మానియేల్ కూడా దెబ్బకు పాప్యులర్ కావడం మనం గమనించవచ్చు. వీరిద్దరూ బుల్లితెర క్రేజీ కపుల్ గా మారిపోయారనే విషయం విదితమే. అయితే ఆ మధ్య వర్ష-ఇమ్మానియేల్ లవ్ ట్రాక్స్ పై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది… అది వేరే విషయం.

అసలు విషయం ఏమంటే పింక్ దుస్తులలో ఆమెని చుసిన జనాలు సైతం మంత్రముగ్ధులైనారు. ఈ క్రమంలో అనేక రకాల కామెంట్స్ చేస్తున్నారు. కుందనపు బొమ్మలాగా ఉందని కొందరు అంటుంటే, వయస్సు పదేళ్లు తగ్గిపోయిందని కొందరు, హీరోయిన్ గా ట్రై చేయమని కొందరు సలహాలు ఇస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా తమని పెళ్లి చేసుకొమ్మని వేడుకుంటున్న పరిస్థితి. ఇకపోతే జబర్దస్త్ వర్ష మొదట ఓ రకమైన ట్రోలింగ్ కి గురయ్యారు. కానీ అలాంటి పరిస్తితునుండి ఆమె ప్రస్తుతం యువకుల కలలరాణిగా మారారు. యాంకర్ అనసూయ, రష్మిలకు ధీటుగా ఆమె ఇరగదీస్తోంది అంటున్నారు ఆమె అభిమానులు.