టాలీవుడ్ హీరోల ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ప్రస్తుతం ఒక్క చిత్రానికి కొన్ని కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. స్టార్ హీరోల అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి అభిమాని కూడ హీరోల గురించి తెలుసుకోవడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తుంటారు.అయితే మన స్టార్ హీరోలు వారు నటించిన మొదటి సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

Best Telugu Actors Ever | 15 Top Telugu Male Actors - Cinemaholic

ఇక చిరంజీవి తన మొదటి సినిమాలో నటించేందుకు రూ.1116 రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడో ఒక చిత్రానికి రూ.40 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు.

మరొక నటుడు మహేష్ బాబు బాల నటుడుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే హీరోగా మొదటి సినిమా రాజకుమారుడులో నటించారు.ఇందుకుగాను రూ.10 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

హీరో ప్రభాస్ మొదటిసారి ఈశ్వర్ సినిమాలో నటించారు ఈ చిత్రానికి రూ .5లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నారు.

పవన్ కళ్యాణ్ మొదట అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో నటించేందుకు రూ .5లక్షల రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక జూనియర్ ఎన్టీఆర్ మొదటి చిత్రానికి ఏకంగా రూ .4లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఎన్టీఆర్ కూడా చైల్డ్ యాక్టర్ గా పలు చిత్రాలలో నటించారు.

అల్లు అర్జున్ తన మొదటి సినిమాలో నటించేందుకు కేవలం రూ.100 రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.

విజయ్ దేవరకొండ నటించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నువ్విలా వంటి చిత్రాలకు అసలు రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించారట. ఇక వేరే కాకుండా ఎంతోమంది స్టార్ హీరోలు సైతం కొన్ని లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నారు.