విడాకుల కోసం భరణం కింద నిహారిక ఎన్ని కోట్లు డిమాండ్ చేసిందో తెలుసా..?

మెగా డాటర్ నిహారిక యాంకర్ గా , హీరోయిన్ గా, నిర్మాతగా ఇండస్ట్రీలో రాణిస్తున్న విషయం తెలిసిందే.. సినిమా జీవితంలో సక్సెస్ కాలేక నిర్మాణరంగంలోకి అడుగుపెట్టిన ఈమె ఇప్పుడు వైవాహిక జీవితంలో కూడా సక్సెస్ పొందలేకపోయిందని చెప్పాలి. నేటితో నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడాకులు తీసుకొని వేరుపడింది. ఎప్పటినుంచో విడాకులు తీసుకోబోతోంది అంటూ వార్తలు రాగా.. ఈరోజు ఆ వార్తలు కాస్త కన్ఫర్మ్ అయిపోయాయి.

హైదరాబాదులోని కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టు వీళ్ళిద్దరికీ నెలరోజుల క్రితమే విడాకులు మంజూరు చేయగా.. ఇక తాజాగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇకపోతే చిత్ర పరిశ్రమలో పెళ్లి చేసుకోవడం, విడిపోవడం అనేది ఇప్పుడు అత్యంత సాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలోనే భర్త నుంచి విడిపోయిన తర్వాత చాలామంది హీరోయిన్లు లేదా వారి భార్యామణులు భరణం కింద కొన్ని కోట్లు తీసుకొని సెటిల్ అవుతున్నారు. ఇప్పుడు నిహారిక కూడా చైతన్య జొన్నలగడ్డ నుంచి విడాకులు తీసుకున్న నేపథ్యంలో భరణం కింద ఏకంగా రూ.100 కోట్లు డిమాండ్ చేసింది అనే ప్రచారం జరిగింది.

కానీ ఆ వార్తలు ఒట్టి పుకార్లే అని నేటితో తేలిపోయాయి . నిహారిక మాత్రం తన భర్త నుంచి ఒక్క రూపాయి కూడా తనకు భరణంగా వద్దు అని తేల్చి చెప్పిందట. తన కాళ్ళ మీద తానే సొంతంగా నిలబడతానని ఆ ధైర్యం, నమ్మకం, శక్తి తనకు ఉన్నాయని చెప్పిందట నిహారిక. అంతేకాదు తనకు ఇష్టం లేని వాళ్ళ దయాదాక్షిన్యాలు కూడా అవసరం లేదు అని కోర్టులోనే తెగేసి చెప్పిందట నిహారిక. ఏది ఏమైనా ఈ విషయాలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.