రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయిన బ్రో సినిమా రైట్స్..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రాలలో బ్రో సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఈ నెల 28వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే .ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి గత కొద్దిరోజుల క్రితం టీజర్ ని కూడా విడుదల చేశారు. దీంతో ఈ సినిమాకు మంచి హైప్ ఏర్పడింది. కేవలం ఒక్క రోజులోనే 30 మిలియన్ల వ్యూస్ ను రాబట్టిన ఈ టీజర్ ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో బిజినెస్ జరుగుతుందో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Bro Movie Poster: Pawan Kalyan and Sai Dharam Tej Shine In Their Stylish  Avatars

బ్రో చిత్రంపై పవన్ కళ్యాణ్ కి ఉండాల్సిన రేంజ్ కంటే ఎక్కువగా మార్కెట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కానీ ఎప్పుడైతే బ్రో టీజర్ సినిమా విడుదల అయిందో అప్పటినుంచి ఎవరు ఊహించని విధంగా మార్కెట్ రేంజ్ పెరిగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఎలా అయితే చూడాలనుకున్నారో అలాగే డైరెక్టర్ సముద్రఖని ఈ చిత్రాన్ని తెరకెక్కించారని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఇందులో సాయి ధరంతేజ్ కూడా నటిస్తూ ఉండడంతో ఈ సినిమాకు మరింత ప్లస్ కానుంది.

పవన్ కళ్యాణ్ ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. కేవలం ఈయన నిడివి 50 నిమిషాల వరకు ఉంటుందని తెలుస్తోంది.అప్పటికి ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా రూ .120 కోట్ల రూపాయలకు పైగా జరిగినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం రాయలసీమలోని ప్రాంతాలలోని ఈ సినిమా హక్కుల కోసం రూ .14 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఇక గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాకు చాలా ఎక్కువగానే బిజినెస్ జరిగినట్లుగా సమాచారం. తెలంగాణ ప్రాంతాలలో కూడా ఈ సినిమా రూ .30 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.