బాక్సాఫీస్ వ‌ద్ద ఆగ‌ని `బేబీ` మ్యానియా.. ఫ‌స్ట్ వీక్ ఎంత రాబ‌ట్టిందో తెలిస్తే మైండ్ బ్లాకే!

బాక్సాఫీస్ వ‌ద్ద `బేబీ` మూవీ మ్యానియా ఏ మాత్రం ఆగ‌ట్లేదు. విడుద‌లై వారం రోజులు గ‌డిచినా.. ఇంకా అదే జోరుతో దూసుకుపోతోంది. ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య‌, విరాజ్ అశ్విన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు. సాయి రాజేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది.

తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. వీకెండ్ లోనే కాదు వ‌ర్కింగ్ డేస్ లోనూ సూప‌ర్ స్ట‌డీగా వెళ్తూ దుమ్ము దుమారం రేపుతోంది. ఫ‌స్ట్ వీక్ లో ఈ మూవీ ఎంత రాబ‌ట్టిందో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8 కోట్లు కాగా.. మూడో రోజుకే లాభాల భాట ప‌ట్టింది.

ఫ‌స్ట్ వీక్ పూర్తి అయ్యే స‌మ‌యానికి తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 20.46 కోట్ల షేర్ సొంతం చేసుకున్న ఈ చిత్రం.. వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 23.53 కోట్లు ద‌క్కించుకుంది. అలాగే రూ. 44.60 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి డ‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ఈ లెక్క‌న బేబీకి ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 15.53 కోట్ల రేంజ్ లో లాభాలు వ‌చ్చాయి. ఇక ఏరియాల వారీగా బేబీ ఫ‌స్ట్ వీక్ టోట‌ల్‌ క‌లెక్ష‌న్స్ ను గ‌మ‌నిస్తే..

నైజాం: 8.56 కోట్లు
సీడెడ్: 2.99 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 3.46 కోట్లు
తూర్పు: 1.60 కోట్లు
పశ్చిమ: 86 లక్ష‌లు
గుంటూరు: 1.09 కోట్లు
కృష్ణ: 1.21 కోట్లు
నెల్లూరు: 69 లక్ష‌లు
—————————————————–
ఏపీ+తెలంగాణ = రూ. 20.46 కోట్లు(రూ. 33.90 కోట్లు~ గ్రాస్)
—————————————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 92 లక్ష‌లు
ఓవ‌ర్సీస్‌: 2.15 కోట్లు
—————————————————–
వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్షన్స్‌= రూ. 23.53 కోట్లు(రూ. 44.60 కోట్లు~ గ్రాస్)
—————————————————–