ఐశ్వ‌ర్యరాయ్ పెళ్లి చీర ఖ‌రీదు ఎంతో తెలిస్తే గుండె ఆగినంత ప‌న‌వుతుంది!

1994లో మిస్ వ‌ర‌ల్డ్ టైటిల్ ను గెలుచుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అందాల భామ ఐశ్వర్య రాయ్.. 16 ఏళ్ల‌కే సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టింది. `ఇరువర్` అనే త‌మిళ చిత్రంతో కెరీర్ స్టార్ చేసింది. ఆ త‌ర్వాత‌ అనేక విజ‌య‌వంత‌మైన‌ సినిమాల్లో న‌టించింది. బాలీవుడ్ లో అగ్ర‌తార‌గా తిరుగులేని ఇమేజ్ ను సంపాదించుకుంది. అనేక అవార్డుల‌ను అందుకుంది.

కెరీర్ పిక్స్ లో ఉన్న స‌మ‌యంలోనే ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ను 2007లో వివాహం చేసుకుని ఐశ్వ‌ర్యరాయ్‌ బ‌చ్చ‌న్ గా మారింది. అప్ప‌ట్లో వీరి వివాహం అత్యంత వైభవంగా జ‌రిగింది. అయితే ఐశ్వ‌ర్యరాయ్ పెళ్లి చీర ఖ‌రీదు ఎంతో తెలిస్తే గుండె ఆగినంత ప‌న‌వుతుంది. దక్షిణ భారతీయురాలు అయినందున పెళ్లి రోజు ఐశ్వ‌ర్య‌రాయ్ కంజీవరం పట్టు చీర కట్టుకోవాలని ఉందని చెప్పిందట. దాంతో ప్ర‌ముఖ డిజైన‌ర్ నీతా లుల్లా ఐశ్వ‌ర్య‌రాయ్ కోసం పసుపు మరియు బంగారు కంజీవరం చీరను ప్ర‌త్యేకంగా రూపొందించారు.

ఈ చీర‌ను స్వరోవ్స్కీ క్రిస్ట‌ల్స్ పాటు క్లిష్టమైన గోల్డ్ థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేశారు. సంస్కృతిని ప్రతిబింబించేలా ఉన్న ఈ చీర‌నే ఐశ్వ‌ర్యరాయ్ త‌న పెళ్లిలో క‌ట్టుకుంది. ఈ చీర ఖ‌రీదు అక్ష‌రాల రూ. 75 లక్ష‌లు. అప్ప‌టి వ‌ర‌కు ఒక పెళ్లి కూతురు ధ‌రించిన అత్యంత ఖ‌రీదైన చీర ఐశ్వ‌ర్య‌దే కావ‌డం విశేషం. ఇక అభిషేక్ బ‌చ్చ‌న్ అద్భుత‌మైన షేర్వాణిలో యువ‌రాజులా వెలిగిపోయాడు. అన్న‌ట్లు ఈ దంప‌తుల‌కు ఆరాధ్య అనే కూతురు ఉంది. ఐశ్వ‌ర్య‌రాయ్ ఇటీవ‌ల మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియిన్ సెల్వన్`లో నందినిగా అద‌ర‌గొట్టేసింది. ప్ర‌స్తుతం ఆమె ప‌లు ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉంది.