వారికి బహిరంగ క్షమాపణలు చెప్పిన నటి కల్పిక గణేష్..!!

టాలీవుడ్ కోలీవుడ్ ప్రేక్షకులకు నటి కల్పిక గణేష్ బాగా సుపరిచితమే ఇమే ఎక్కువగా కాంట్రవర్సీ లతోనే పాపులారిటీ అయింది.. ఏదో ఒక వివాదంలో నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంటుంది.గతంలో ప్రముఖ డైరెక్టర్ బాలాజీ మోహన్,నటి ధన్య బాలకృష్ణ వ్యక్తిగత విషయాల పైన పలు రకాల కామెంట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా డైరెక్టర్ బాలాజీ మోహన్ కు తన భార్య ఉండంగానే నటి ధన్య తో ఎఫైర్ ఉన్నట్లుగా ఆరోపించడం జరిగింది. వీరిద్దరూ సీక్రెట్ గా వివాహం చేసుకున్నారంటూ కూడా పలు రకాల కామెంట్లు చేయడం జరిగింది.

ఈ నేపథ్యంలోనే బాలాజీ తమ పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చారు.. అయితే ఆ తర్వాత కల్పికాపై మద్రాస్ హైకోర్టులో పరువు నష్టం దావా వేయడం జరిగింది. దీంతో కల్పికాకు పెద్ద చిక్కు ఎదురైందని చెప్పవచ్చు. కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.కోర్టులో కేసులు ఎందుకు అనుకున్న కల్పిగా తాజాగా వెనక్కు తగ్గి బాలాజీ మోహన్- ధాన్యలకు బహిరంగ క్షమాపణ తెలియజేయడం జరిగింది. కొన్ని రోజుల క్రితం ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది.”హాయ్ నా పేరు కల్పిక గణేష్ తమిళ డైరెక్టర్ బాలాజీ.. నటి ధన్య బాలకృష్ణ లకు నేను క్షమాపణ చెబుతున్న నేను వారిపై తప్పుడు ఆరోపణలు చేశాను వారి పరువు దిగజార్చే విధంగా సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అవన్నీ ఆరోపణలు తప్పే అంటూ తెలియజేసింది”.

అయితే వారిద్దరూ ఎప్పుడు ఏ చెడు కూడా చేయలేదని వారి కుటుంబ సభ్యులకు ఫాన్స్ కు నా మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నాను అంటూ తెలిపింది. ఇకపై వారి గురించి ఎలాంటి మాటలు మాట్లాడను అని తెలిపింది కల్పిక. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.