రామ్ చ‌ర‌ణ్ కూతురు జాత‌కం చెప్పిన‌ వేణు స్వామి.. అలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయంటూ షాకింగ్ కామెంట్స్‌!

అడగకపోయినా సినీ, రాజకీయ ప్రముఖుల జాతకం చెబుతూ పాపులర్ అయిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి.. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముద్దుల కూతురు జాతకం చెప్పారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు నిన్ననే తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ తమ మొదటి బిడ్డ‌కు ఆహ్వానం పలికారు. అపోలో హాస్పిటల్ లో జూన్ 20వ తేదీన పండంటి ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చింది.

దీంతో మెగా ఫ్యామిలీలో అందరూ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక ఇదే సమయంలో వేణు స్వామి రామ్ చరణ్ కుమారు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వివరించారు. ఉపాసన కూతురు జూన్ 20వ తేదీ తెల్ల‌వారుజామున‌ 1:49 నిమిషాలకు జన్మించింది. అంటే పునర్వసు నక్షత్రం, రెండవ పాదం మిధునరాశిలో జన్మించిందని వేణు స్వామి వెల్ల‌డించాడు. రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంపతుల పాప జాత‌కం ఎంతో అద్భుతంగా ఉంద‌ని.. పాప‌ది రాజయోగ‌మ‌ని వేణు స్వామి పేర్కొన్నాడు.

మెగా ఫ్యామిలీలో ఈ పాప ఎన్నో శుభాలు తీసుకొస్తుంద‌ని.. చిరంజీవి గారి మాదిరిగానే పాప పెద్దయ్యాక అద్భుతమైన ప్రగతి సాధిస్తుంద‌ని, చ‌రిత్ర సృష్టిస్తుంద‌ని వేణు స్వామి చెప్పుకొచ్చారు. అయితే పాప ఆరోగ్యం పరంగా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని.. ముఖ్యంగా చెవి, పన్ను సమస్యలతో బాధ పడే అవకాశం ఉందని.. అయితే ఆ సమస్యలు ఎక్కువ కాలం ఉండక పోవచ్చు అంటూ వేణు స్వామి పేర్కొన్నారు. ఇక ఇదే సంద‌ర్భంగా చిరంజీవి యొక్క వంశానికి వారసుడు ఉండ‌ర‌ని కూడా ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశాడు. దీంతో వేణు స్వామి కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.