టాలీవుడ్ లో హీరో హీరోయిన్స్ కి ఎంత క్రేజ్ ఉందో అలాగే సినీ నటుల, రాజకీయ నాయకుల జ్యోతిష్యం చెబుతూ వేణు స్వామి ఆస్ట్రాలజర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.ఇండస్ట్రీలో అంతే క్రేజ్ ఉంది. ఎందుకంటే ఆయన ఎంతోమంది హీరోయిన్స్ చేత పూజలు చేయిస్తూ వైరల్ గా మారుతూ ఉంటారు.. ముఖ్యంగా నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటారని సంగతి చెప్పింది వేణు స్వామి అది చెప్పింది చెప్పినట్లు జరిగింది.
ఆ తరువాత ఒక హీరో అనారోగ్యంతో చనిపోతాడని చెప్పాడు దానికి నిదర్శనంగా తారకరత్న చనిపోయాడు. ఈ మధ్యనే మోస్ట్ పాపులారిటినీ సంపాదించుకున్న రష్మిక కూడా ఆయన పూజలు జరిపించడంతో రష్మిక స్టార్ హీరోయిన్గా మారిందని చెబుతూ ఉంటారు. ఇక నిధి అగర్వాల్ కూడా ఈ మధ్యనే పూజలు చేయించినట్టు సమాచారం. అప్పుడప్పుడు రాజకీయాల వైపున స్పందిస్తూ ఉంటారు వేణు స్వామి.
ఇక వీరే కాదు బాలయ్య కూడా ఈయన కస్టమర్ అని కొద్ది రోజుల క్రితమే తెలియజేశారు. వేణు స్వామి చెప్పింది చెప్పినట్లు జరుగుతాయన్న నమ్మకం ఇండస్ట్రీలో నటీనటులకు కలుగుతోంది. ఇప్పుడు ఒక షాకింగ్ విషయాన్ని తెలియజేయడం జరిగింది.. ఏంటంటే ఇద్దరూ హీరోలు మరణిస్తారని ఆయన ఒక ప్రకటన ఇచ్చారు. ఈ విషయంపై ఇండస్ట్రీలో అందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఇంతకు ఆ ఇద్దరు ఎవరు ఎలా చనిపోతారు అన్న విషయం వేణు స్వామి తెలిపారు.
ఆయన చెప్పిన వారిలో ఒకరు అనారోగ్యంతో చనిపోతారట. మరొకరు ఆర్థిక ఇబ్బందులతో చనిపోతారట. వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇద్దరు హీరోలే కాకుండా ఒక హీరోయిన్ కూడా అనారోగ్యంతో చనిపోతుందని చెప్పారు. వేణు స్వామి చెప్పారు కానీ ఇంతకు ఆ హీరోయిన్, హీరోలు ఎవరు అనే విషయంపై ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. అది కూడా 2026 లో మరణిస్తారని తెలియజేశారు. మరి ఈ విషయం నిజమో కాదో చూడాలి మరి.