టాలీవుడ్ లో వెడ్డింగ్ బెల్స్‌.. టీచ‌ర్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న స్టైలిష్ విల‌న్!

టాలీవుడ్ లో వ‌రుసగా వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఒక‌రి త‌ర్వాత ఒక‌రు పెళ్లిపీట‌లెక్కేస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో టాలీవుడ్ స్టైలిష్ విల‌న్ కబీర్ దుహన్ సింగ్ కూడా చేర‌బోతున్నాడు. ఇత‌గాడు తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మే. గోపీచంద్ `జిల్` మూవీ ద్వారా విల‌న్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన క‌బీర్‌.. కిక్ 2, స్పీడున్నోడు, డిక్టేటర్, సర్దార్ గబ్బర్ సింగ్, సుప్రీం ఇలా అనేక చిత్రాల్లో న‌టించాడు. ప‌వ‌ర్ ఫుల్ యాక్టింగ్ తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.

త‌మిళ్‌, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లోనూ ప‌లు సినిమా చేసిన క‌బీర్‌.. త‌న బ్యాచిల‌ర్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేయ‌బోతున్నాడు. మ‌రో రెండు రోజుల్లోనే క‌బీర్ పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడు. హ‌ర్యానాకు చెందిన ఓ యువ‌తతో ఏడ‌డుగులు వేయ‌బోతున్నాడు. జూన్ 23వ తేదీన హ‌ర్యానాలో సూర‌జ్ ఖండ్ లోని ఓ ఫంక్ష‌న్ హాల్ తో క‌బీర్ పెళ్లి జ‌ర‌గ‌బోతోంది.

ఆల్రెడీ పెళ్లి ప‌నులు కూడా ప్రారంభం అయ్యాయి. మెహందీ, సంగీత్ వంటి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. క‌బీర్ వివాహానికి ఇరు కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితులు, స్నేహితుల‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సైతం హాజ‌రు కానున్నారు. అన్న‌ట్లు క‌బీర్ కు కాబోయే భార్య పేరు సీమా చాహ‌ల్‌. ఆమె హైరానాలో టీచ‌ర్ గా వ‌ర్క్ చేస్తుంద‌ని తెలుస్తోంది.