ధనుష్‌తో జతకట్టనున్న త్రిష.. ఆమె ప్లే చేస్తున్న రోల్ ఇదే..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. పందెం కోళ్ళు, రఘువరన్ బీటెక్ వంటి సినిమాలతో తెలుగువారికి, రంజానా సినిమాతో హిందీ వారికి ఈ టాలెంటెడ్ హీరో సుపరిచితుడు అయ్యాడు. ఇటీవలే తెలుగులో ‘సార్’ సినిమాలో నటించి మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ధనుష్ తన 50వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

గ్యాంగ్ స్టర్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కే ఈ సినిమాకి ధనుష్ స్వీయ దర్శకుడు. అయితే ఈ సినిమాలో ధనుష్ కి జంటగా త్రిష అయితే బాగుంటుందని చిత్ర బృందం భావిస్తున్నారట. ఇక హీరోయిన్ పాత్రకోసం త్రిషని కూడా సంప్రదించి కథ వినిపించారట. కథ విన్న తరువాత ఈ సినిమాలో నటించడానికి త్రిష సానుకూలంగా స్పందించారట.

ఇదిలా ఉండగా 2016లో ధనుష్ త్రిష కాంబినేషన్ లో వచ్చిన ‘ధర్మయోగి’ సినిమాలో త్రిష పాత్ర నెగిటివ్ షేడ్స్ లో ఉంటుంది. ఇక మరోసారి వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మరి ధనుష్ 50 సినిమా లో త్రిష పాత్ర ఎలా ఉంటుంది? అని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. త్రిష పాత్ర గురించి ఒక క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. వీరి కాంబోలో ఒక సినిమా రావాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. అయితే త్వరలోనే వీరి కోరిక నెరవేరుతుందని లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తోంది.