సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంట పెళ్లి వేడుకల షురూ..

టాలీవుడ్ స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ యాసలో ‘మగజాతి’ జానపద పాటతో యూట్యూబ్‌లో మంచి పాపులారిటీ  సంపాదించుకున్నాడు. 2009లో వచ్చిన జోష్ సినిమాలో ‘ కాలేజ్ బుల్లోడ’ పాటతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తరువాత ధీర, 90ML, రంగస్థలం, ఊర్వశివో రాక్షసివో, చల్ మోహన్ రంగా, ఆర్ఆర్ఆర్ లాంటి ఎన్నో సినిమాలకు పాటలు పాడాడు. అలానే బిగ్ బాస్ విన్నర్ గా కప్ అందుకున్నాడు.

పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో ఆస్కార్ అవార్డు అందుకున్న ‘నాటు నాటు’ పాట పాడింది కూడా రాహుల్ సిప్లిగంజ్. ఇలా యూట్యూబర్ గా కెరీర్ మొదలు పెట్టిన రాహుల్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో టాప్ సింగర్ గా ఏదిగాడు. అంతేకాకుండా కొన్ని సినిమాలో కూడా నటించాడు. అలాంటి రాహుల్ సిప్లిగంజ్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. అయితే పెళ్లి రాహుల్ ది కాదు, అతని తమ్ముడు నిఖిల్ సిప్లిగంజ్ ది. ఈ పెళ్లి హైదరాబాద్ లో ఎంతో ఘనంగా జరిగింది.

రాహుల్ కుటుంబంలో జరిగిన పెళ్లి వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యి వధూవరులను ఆశీర్వధించారు. తాజాగా ఈ వేడుకకు సంబందించిన ఫోటోలను రాహుల్ సిప్లిగంజ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసాడు. రాహుల్ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక రాహుల్ సిప్లిగంజ్ తన తమ్ముడి పెళ్లి వేడుక సందర్బంగా నాటు నాటు పాట లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రాహుల్ ఇంట జరిగిన పెళ్లి వేడుక ఫోటోలను ఫుల్ గా షేర్ చేస్తూ, లైక్స్ కొడుతున్నారు చాలా మంది.