ఇండియాలోనే టాప్-10 సంపన్న హీరోయిన్స్ వీళ్ళే..!!

ఇండియన్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారని చెప్పవచ్చు. ఇందులో టాప్ టెన్ రిచెస్ట్ హీరోయిన్ ఎవరనే విషయం అందరిలోనూ కలుగుతూ ఉంటుంది. అయితే ఈ ప్రశ్నకు సమాధానం కావాలి అంటే కచ్చితంగా చెప్పడం చాలా కష్టమని చెప్పవచ్చు. అయినప్పటికీ తాజాగా ప్రముఖ మీడియా సంస్థ తెలిపిన సమాచారం మేరకు ఇండియాలో ఉండే టాప్-10 రిచెస్ట్ హీరోయిన్స్ గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

Are Priyanka Chopra and Aishwarya Rai Bachchan at loggerheads? | Hindi  Movie News - Times of India
అసలు విషయంలోకి వెళ్తే టాప్ టెన్ రిచెస్ట్ హీరోయిన్లలో మొదటిగా వినిపించే పేరు మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్.. ఈమె నికర ఆస్తి విలువ దాదాపుగా రూ.820 కోట్లు పైగా ఉన్నట్లు ప్రముఖ జాతీయ మీడియా తెలియజేయడం జరిగింది. ఇప్పటికీ అదే అందంతో మెయింటైన్ చేస్తూ పలు చిత్రాలలో నటిస్తోంది ఐశ్వర్యరాయ్. ప్రస్తుతం ఒక్క చిత్రానికి రూ .10 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఆ తర్వాత స్థానంలో గ్లోబల్ స్టార్ గా పేరుపొందిన ప్రియాంక చోప్రా ఉన్నది. ఈమె ఆస్తి విలువ రూ .565 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇమే కూడా ఒక చిత్రానికి రూ.10 కోట్ల రూపాయలు పైగా తీసుకుంటోంది.

Deepika Padukone, Aishwarya Rai Bachchan & Priyanka Chopra Make It To The  World's Most Admired Women Of 2018 List
ఇక ఆ తర్వాత స్థానం ఆలియా భట్ ఆస్తి విలువ రూ.555 కోట్ల రూపాయలు ఈమె ఒక్కో చిత్రానికి రూ .8 కోట్ల రూపాయలు తీసుకుంటోంది. ఆ తర్వాతి స్థానం కరీనాకపూర్ రూ .440 కోట్ల రూపాయలు. ఈమె ఒక్కొక్క చిత్రానికి రూ .9 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఆ తర్వాత స్థానం హీరోయిన్ దీపికా పదుకొనే ఈమె ఆస్తి రూ .300 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు సమాచారం. ఈమె కూడా ఒక్క చిత్రానికి రూ .10 కోట్ల రూపాయలు అందుకుంటోంది. ఆ తర్వాత స్థానం కత్రినా కైఫ్ రూ .150 కోట్లు తో పాటు సొంతంగా మేకప్ బ్రాండ్ లకే బాగా ప్రాధాన్యత ఇస్తొంది. ఆ తర్వాత స్థానం మాధురి దీక్షిత్ వందకోట్లు ఉండగా.. అనుష్క శర్మ ఆస్తి రూ .225 కోట్లు.. ఇక టాలీవుడ్ హీరోయిన్ సమంత ఆస్తి విలువ రూ .80 కోట్లు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా కేవలం వీరి యొక్క నిలకడ ఆస్తి అన్నట్లుగా తెలుస్తోంది.