వ‌య‌సుతో ప‌నిలేదు.. ఏ హీరో అయినా నాకు ఒకే అంటున్న శ్రీ‌లీల‌..!

టాలీవుడ్ లో యంగ్ సెన్సేషన్ గా మారినా శ్రీలీల ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీ లోకి వచ్చి రెండేళ్లు కాకముందే యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలకు కూడా ఈ బ్యూటీ మోస్ట్ వాంటెడ్ మారింది.

ఇప్పుడు ఈ అమ్మ‌డు మహేష్ బాబు, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, పవన్ కళ్యాణ్, రామ్‌, నవీన్ పొలిశెట్టి, వైష్ణవ్‌ తేజ్, నితిన్ ఇలా పలువురు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల.. ప‌లు ఇంట్రెస్టింగ్‌ విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే అగ్ర హీరోల సినమాల్లో చేయడం వల్ల ఏదైనా ప్రత్యేక ముద్ర పడుతుందని మీకు ఎప్పుడైనా భయం వేసిందా..? అని ప్ర‌శ్నించ‌గా.. శ్రీ‌లీల‌ ఆసక్తికర సమాధానం ఇచ్చింది.

`సీనియర్లతో ఒకలా యంగ్ హీరోలతో చేస్తే మరోలా ఇమేజ్ వస్తుంది అనే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు అంతా మారిపోయింది. ప్రతి ఒక్కరూ ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు. నా వరకు వస్తే నేను ఎంచుకున్న పాత్రకు పూర్తి న్యాయం చేయడమే నాకు ముఖ్యం. నాతోటి నటుల వయసుతో సంబంధం లేదు. ఏ హీరో అయినా నాకు ఓకే. క‌థ‌, పాత్ర నచ్చితే ఏ హీరోతో అయినా నేను నటిస్తాను` అంటూ శ్రీలీల చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.