అన్ని కోట్లు పెట్టీ భూమిని కొన్న స్టార్ కిడ్.. కారణం..?

టాలీవుడ్ లో కాని బాలీవుడ్ లో కాని స్టార్స్ సైతం చాలామంది ఫామ్ హౌసులు కాంప్లెక్స్లు రియల్ ఎస్టేట్స్ లలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అయితే అతి తక్కువ మంది వ్యవసాయ భూములపై పెట్టుబడి పెడతారు. బాలీవుడ్ స్టార్స్ హీరోలకి ఫామ్ హౌస్ లు ఉన్నాయని విషయం అందరికీ తెలిసిందే.. స్టార్ హీరోలు సమయం దొరికినప్పుడల్లా అందులో పని చేస్తూ రకరకాల చెట్లని పెంచుతూ ఉండేటువంటి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.

Suhana Khan reveals the trait she shares with her father Shah Rukh Khan

అంతేకాకుండా ఆ ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేస్తూ ఉన్న ఫోటోలను కూడా కొన్నిసార్లు షేర్ చేయడం జరుగుతోంది .అయితే ఇప్పుడు షారుఖ్ ఖాన్ కూతురు కూడా వ్యవసాయ భూమి కొనుగోలు చేసింది. తన తండ్రి లాగే తనకి కూడా వ్యవసాయం అంటే చాలా ఇష్టమట. అందుకనే మహారాష్ట్ర రామ్ గడ్ జిల్లాలోని తీర ప్రాంత పట్టణం అయినా అలీబాగ్ ప్రాంతంలో దాదాపు రూ.13 కోట్ల రూపాయలు పెట్టి ఒక వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

సుహానా ఖాన్ వ్యవసాయం అంటే ఎక్కువ మక్కువ ఉండటంతో ఆమె ఇలా ఒక వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ వార్తపై షారుక్ ఖాన్ నుంచి ఎలాంటి విషయము బయటకు రాలేదు. కానీ ఇది నిజమేన అనే విషయం తెలియాలి అంటే సుహానా ఖాన్ స్పందించాల్సి ఉంటుంది.. హీరోయిన్గా షారుఖ్ ఖాన్ కూతురు ఎంట్రీ ఇస్తుందనుకుంటే ఈమె ఇలా పలు రకాల భూములు మీద ఇన్వెస్ట్ చేయడంతో అభిమానుల సైతం కాస్త ఆశ్చర్యపోతున్నారు షారుక్ ఖాన్ కూతురు సినిమాల వైపు కాకుండా బిజినెస్ వైపు ఎక్కువ మక్కువ చూపుతోందా అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.