మ‌ళ్లీ అడ్డంగా దొరికిపోయిన థమన్.. `గుంటూరు కారం` బీజీఎం ను అక్క‌డ నుంచి లేపేశావా?

కెరీర్ ఆరంభం నుంచి మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ కాపీ విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటూనే ఉన్నాడు. థ‌మ‌న్ కు `కాపీ క్యాట్‌` అనే బిరుదు కూడా ఉంది. తాజాగా ఈయ‌న మ‌రోసారి నెటిజ‌న్ల‌కు అడ్డంగా దొరికిపోయాడు. ప్ర‌స్తుతం థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్న చిత్రాల్లో త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌, మ‌హేష్ బాబు హ్యాట్రిక్ మూవీ ఒక‌టి. ఇందులో పూజా హెగ్డే, శ్రీ‌లీల హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి `గుంటూరు కారం` అనే ఊర‌మాస్‌ టైటిల్ ను లాక్ చేశారు. మే 31 సూప‌ర్ స్టార్ కృష్ణ జ‌యంతి సంద‌ర్భంగా టైటిల్ తో పాటు ఫ‌స్ట్ గ్లింప్స్ ను విడుద‌ల చేశారు. ఇందులో బీడీ కాలుస్తూ మాస్ లుక్ లో మ‌హేష్ ఆక‌ట్టుకున్నాడు. ‘ఏంది అలా చూస్తున్నావ్..?, బీడీ 3డీ లో కనిపిస్తుందా’ అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ ఫ‌స్ట్ గ్లింప్స్‌ లో హైలెట్ గా నిలిచింది.

మ‌రోవైపు థ‌మ‌న్ వాయించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. కానీ, `గుంటూరు కారం` ఫ‌స్ట్ గ్లింప్స్‌ బీజీఎం వింటే రకరకాల పాత మ్యూజిక్స్ మన మైండ్ లో స్ట్రైక్ అవుతుంటాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ బ్లాక్ బ‌స్ట‌ర్ `నాన్నకు ప్రేమతో` మూవీలో క్లైమాక్స్ లో అరబిక్ స్టయిల్ లో ఓ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ కి దేవిశ్రీ ఇచ్చిన ట్యూన్స్ ని లేపేసి గుంటూరు కారం చిత్రానికి బీజీఎం ఇచ్చాడు అంటూ వీడియో ఫ్రూవ్ తో స‌హా నెటిజ‌న్లు థ‌మ‌న్ పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.