నాగ‌చైత‌న్యలో నాకు బాగా న‌చ్చింది అదే.. శోభిత హాట్ కామెంట్స్ వైర‌ల్‌!

యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య స‌మంత‌తో విడిపోయిన త‌ర్వాత టాలెంటెడ్ బ్యూటీ శోభిత ధూళిపాళ‌తో ప్రేమ‌లో ప‌డ్డాడ‌ని.. ఆమెతో సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నాడ‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రూ పెళ్లి చేసుకునే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు కూడా ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఈ ప్ర‌చారంపై చైతు ఎప్పుడూ నేరుగా స్పందించ‌లేదు.

శోభిత మాత్రం ఈ ప్ర‌చారాన్ని ఖండించింది. కానీ, లండ‌ర్ లో చైతు, శోభిత ఓ రెస్టారెంట్ కు డిన్న‌ర్ వెళ్లిన ఫోటో ఒక‌టి బ‌య‌ట‌కు రావ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. అయితే శోభిత మాత్రం ఆ ఫోటోలు ఉన్న‌ది తాను కాను అంటూ సింపుల్ గా తేల్చేసింది. ఇదంతా ప‌క్క‌న పెడితే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న శోభిత నాగ‌చైత‌న్య‌పై హాట్ కామెంట్స్ చేసింది.

నాగ‌చైత‌న్య గురించి చెప్ప‌మ‌ని ప్ర‌శ్నించ‌గా.. చైతూ చాలా మర్యాదస్తుడు. ఎంతో హుందాగా ఉంటాడు. ఎప్పుడూ ప్రశాంతంగా, కూల్ గా ఉంటాడు. అతనిలో నాకు నచ్చింది అదే అంటూ శోభిత చెప్పుకొచ్చింది. అయితే నాగ చైతన్యతో శోభిత ఇంత‌వ‌ర‌కు ఒక్క సినిమా కూడా చేసింది. మ‌రి చైతు గురించి ఇన్ని విష‌యాలు శోభిత‌కు ఎలా తెలిశాయి అంటూ నెటిజ‌న్లు చర్చించుకుంటున్నారు. అంటే వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో జ‌రుగుతోంది అంటూ అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక ఇదే ఇంట‌ర్వ్యూలో శోభితా స‌మంత‌పై మాట్లాడింది. `ది ఫ్యామిలీ మాన్ 2 కి సమంత బెస్ట్ ఛాయిస్. ఆమె ప్రాజెక్ట్స్ ఎంపిక గొప్పగా ఉంటుంది. ఆమె కెరీర్ లో మరింత రాణిస్తారు` అంటూ శోభితా పేర్కొంది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.