తెలుగు హీరోలు తమిళ హీరోకు మధ్య మళ్లీ అదే సమస్య..!!

టాలీవుడ్లో ఎప్పుడూ కూడా  స్టార్ హీరోల మధ్య ఒక వార్ జరుగుతూనే ఉంటుంది.. ఇప్పుడు తాజాగా బాలయ్య- రవితేజ నటించిన సినిమాల మధ్య ఒక వార్ జరగబోతుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. గత సంక్రాంతికి విడుదలైన చిత్రాలలో బాలయ్య, చిరంజీవి సినిమాలు పోటీ పడడం జరిగింది. అలాగే తమిళ హీరో విజయ్ దళపతి వారసుడు సినిమా కూడా పోటీ పడడంతో కాస్త ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు తాజాగా మళ్లీ అలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది.
Ravi Teja, Lot Depends on Balakrishna
తమిళ సూపర్ స్టార్ నటించిన విజయ్ లియో సినిమా హక్కులను పొందేందుకు పాలు చర్చలు జరుగుతున్నాయి. ఈ సూపర్ టాలెంటెడ్ చిత్రాన్ని డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో అక్టోబర్ 19న రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.  అదే రోజున రెండు బడా సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి టాలీవుడ్వి.. బాలయ్య నటిస్తున్న 108వ చిత్రం డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రానికి భగవత్ కేసరి అనే టైటిల్ ని ఉంచ బోతున్నట్లు సమాచారం.
Vijay's Thalapathy 67 team head to Kashmir for the next schedule of  shooting | Tamil Movie News - Times of India
మరొక సినిమా ఏమిటంటే రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రం ఈ రెండు సినిమాలు ఇదే సమయానికి విడుదల కాబోతున్నాయి. కేవలం ఒకటి రెండు రోజుల గ్యాప్ లో బోయపాటి శ్రీను,రామ్ పోతినేని నటిస్తున్న చిత్రం కూడా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నియంత్రణ ఉన్న ఒక పెద్ద నిర్మాత విజయ్ లియో హక్కులను తీసుకుంటే మళ్లీ ఇదే సమస్య ఏర్పడుతుందని పలువురి సినీ ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. మరి ఈరోజుల్లో తెలుగు సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్లో విడుదల అవుతున్నందువలన తమిళ సినిమా లియోని ఆపడం కష్టం అంటున్నారు సినీ ప్రేక్షకులు.