సమంత తాజా హాట్ ఫోటో షూట్… అస్సలు తేడా తెలియట్లేదు!

హీరోయిన్ సమంత గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె సినిమా కెరీర్ అంత సాఫీగా సాగలేదు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య సామ్ సూపర్ స్టార్ గా గుర్తింపు సాధించింది. ఇంకా అనేక సేవ కార్యక్రమాల ద్వారా చాలా మంచి పేరు సంపాదించుకుంది. మొదటి సినిమా ‘ఏ మాయ చేసావే’ సినిమాతోనే హిట్టు కొట్టిన సామ్ తరువాత తిరిగి వెనక్కి చూసుకోలేదు. వరుస పెద్ద పెద్ద సినిమాలలో నటిస్తూ నటిగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది సమంత. చిన్న చిన్న హీరోల నుండి అగ్ర హీరోల వరకు అందరితోనూ నటించే అనుభవం వుంది సమంతకు. టాలీవుడ్లో హీరోలకు తీసిపోని విధంగా మంచి ఫ్యాన్ బేస్ వున్న నటీమణులలో సమంత ఒకరు.

అందుకే ఆమెని లక్కీ లేడీగా టాలీవుడ్ కీర్తించింది. ఇక అంతా సాఫీగా సాగిపోతోంది అనుకున్నవేళ సామ్ ‘మాయోసైటిస్’ అనే వ్యాధితో చాలా పోరాటం చేసింది. ఎట్టకేలకు సామ్ ఆరోగ్యం కుదుటపడడంతో మరలా సినిమాల వైపు దృష్టి సారించింది. ప్రస్తుతం ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలవైపు మొగ్గు చూపుతోంది. అడపాదడపా వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ తన ఉనికిని చాటుకుంటోంది సామ్. మరోవైపు ఆమె అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది.

ఈ క్రమంలోనే ఆమె తాజాగా చేసిన హాట్ ఫోటో షూట్ కి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సమంత ప్రస్తుతం విదేశాల్లో విహరిస్తున్నారు. సిటాడెల్ షూటింగ్ కోసం సెర్బియా దేశం వెళ్లిన సమంత తనకి ఇష్టమైన ప్రదేశాల్లో విహరిస్తోంది. ఈ క్రమంలో సమంత లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. లోదుస్తులు ధరించకుండా హాట్ క్లీవేజ్ షోతో కుర్రాళ్ళ టెంపరేచర్ పెంచేసింది సామ్. అవును, సమంత బోల్డ్ ట్రీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దాంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా సిటాడెల్ లేటెస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్లు సమాచారం.