విజ‌య్ సేతుప‌తికి ఘోర అవ‌మానం.. `నీ ముఖానికి సినిమాలా` అంటూ దారుణంగా వెక్కిరించారా?

విజ‌య్ సేతుప‌తి.. ఈయ‌న ఎంత టాలెంటెడ్ న‌టుడో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. నిజానికి స్టార్ హోదాలో ఉన్న హీరోలు.. ఇత‌ర పాత్ర‌లు చేసేందుకు మొగ్గు చూప‌రు. కానీ, విజ‌య్ సేతుప‌తి మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ఓవైపు హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు విల‌న్ గా స‌త్తా చాటుతున్నాడు. అలాగే స‌హాయ‌క పాత్ర‌ల‌ను కూడా పోషిస్తూ విల‌క్ష‌ణ న‌టుడిగా పేరు సంపాదించుకున్నాడు.

ప్ర‌స్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ ప‌లు ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్న విజ‌య్ సేతుప‌తికి ఇప్పుడి అనుభ‌విస్తున్న స్టార్డ‌మ్ అంత ఈజీగా ఏమీ రాలేదు. ఆఫ‌ర్ల కోసం ఫోటోల‌ను చేతులో ప‌ట్టుకుని చెప్పులు అరిగిపోయేలా తిరిగారు. ఎన్నో ఘోర అవ‌మానాల‌ను ఎదుర్కొన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న‌ విజయ్ సేతుపతి.. కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభ‌వాల గురించి మాట్లాడారు.

`థియేటర్ లో అకౌంటెంట్ గా వ‌ర్క్ చేస్తూనే.. మ‌రోవైపు సినిమా అవకాశల కోసం ప్రయత్నించేవాడిని. ఫోటోలు పట్టుకుని సినిమా ఆఫీస్ లు చుట్టూ రోజూ తిరిగేవాడిని. అప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న.. నన్ను చూడగానే నీ ముఖానికి సినిమాలు కూడానా అంటూ దారుణంగా వెక్కిరించేవారు. కొంతమంది నా ఫోటోలు చూడటానికే ఇష్టపడేవారు కాదు. ఇంకొంత మంది అవ‌కాశం ఇచ్చి తీరా సెట్స్ వెళ్లాక ఆ పాత్ర మ‌రొక‌రితో చేయించేవాడు. ఈ సంద‌ర్బాల్లో ఎంతో బాధ క‌లిగేది. కానీ, ఎప్పుడూ ఆత్మవిశ్వసం కోల్పోలేదు. నా ఆత్మ‌విశ్వాస‌మే న‌న్ను ఈ స్థాయిలో నిల‌బెట్టింది` అంటూ విజ‌య్ సేతుపతి చెప్పుకొచ్చారు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.