అదిరిపోయే ఔట్ ఫిట్ లో చెమటలు పట్టిస్తున్న జాన్వీ కపూర్..!

అందాల తార అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్లో స్టార్ కిడ్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఆ తర్వాత తన నటనతో మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె తల్లికి తగ్గ కూతురిగా మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఇకపోతే ఆమె తండ్రి బోనీ కపూర్ బడా నిర్మాత అయినప్పటికీ కూడా ఆయన సహాయం ఏమాత్రం తీసుకోకుండా ఇండస్ట్రీలో స్వతహాగా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. అందుకే అనతి కాలంలోనే ఎక్కువ పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్గా చలామణి అవుతుంది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా సినిమాలో హీరోయిన్గా అవకాశాన్ని దక్కించుకుంది. ఇదివరకే ఈ సినిమా నుంచి ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ ఇటీవల విడుదల చేయగా.. సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఈ నేపథ్యంలోనే ఈమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు ఎన్టీఆర్ తో సినిమా అయిపోయిన వెంటనే రాంచరణ్ తో బుచ్చిబాబు సనా కాంబినేషన్లో వచ్చే సినిమాల్లో కూడా ఈమె హీరోయిన్ కావడం గమనార్హం. ఇలా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే గ్లోబల్ స్టార్ట్స్ తో అవకాశం దక్కించుకోవడం నిజంగా ఈమె అదృష్టం అని చెప్పాలి.

ఇకపోతే రోజుకొక గ్లామర్ షో తో యువతను ఉక్కిరిబిక్కిరి చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా లేటెస్ట్ అవుట్ ఫిట్ తో మైమరిపించింది.. స్కై బ్లూ కలర్ అవుట్ ఫిట్ లో ఒక సైడు లో దుస్తులు కనిపించేలా ఎద అందాలను చూపిస్తూ మరొకసారి రచ్చ చేసింది. మొత్తానికి అయితే ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి.