గుడ్‌న్యూస్‌.. ఫైన‌ల్‌గా ఓ ఇంటివాడు కాబోతున్న హీరో రామ్.. ఇంత‌కీ అమ్మాయి ఎవ‌రో తెలుసా?

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో ఉన్న వారంతా ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. ఇటీవల శర్వానంద్ రక్షిత రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు. మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ త్వరలో లావణ్య త్రిపాఠితో ఏడడుగులు వేయబోతున్నాడు. ఇక ఇప్పుడు ఈ జాబితాలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా చేరబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

ఫైనల్ గా రామ్ కూడా ఓ ఇంటివాడు అవ్వబోతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌త రెండు, మూడేళ్ల నుంచి రామ్ కు ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారు. అయితే తాజాగా ఓ అమ్మాయికి రామ్ ఓటేశాడ‌ట‌. స‌ద‌రు అమ్మాయి బడా వ్యాపార వేత్త కూతురు అని.. హైద‌రాబాద్ లో వారి ఫ్యామిలీ సెటిల్ అయింద‌ని అంటున్నారు.

త‌ర్వ‌లోనే ఆ అమ్మాయితో రామ్ ఎంగేజ్మెంట్‌, ఆపై పెళ్లి ఉండ‌బోతున్నాయ‌ని ఓ వార్త నెట్టింట వైర‌ల్ గా మారింది. ప్ర‌స్తుతం రామ్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో త‌న 20వ చిత్రాన్ని చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో శ్రీ‌లీల హీరోయిన్ గా న‌టిస్తోంది. అయితే ఈ సినిమా త‌ర్వాత రామ్ మ‌రో ప్రాజెక్ట్ కు క‌మిట్ కాలేదు. అందుకు కార‌ణం త‌న పెళ్లి పిక్స్ అవ్వ‌డ‌మే అని అంటున్నారు. బోయ‌పాటి మూవీ పూర్తైన వెంట‌నే రామ్ పెళ్లి పీట‌లెక్క‌డం ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.