లగ్జరీ హౌజ్‌ కట్టించిన బిగ్‌బాస్ ఫేమ్ హిమజ.. గృహప్రవేశం పిక్స్ వైరల్..

ప్రముఖ నటి, బిగ్‌బాస్‌-3 కంటెంట్ హిమజ తాజాగా తన చిరకాల నాటి కోరికను నెరవేర్చుకుంది. ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్‌లో గేటెడ్ కమ్యూనిటీలో నాలుగు అంతస్తుల ఇంటిని నిర్మించింది. తాజాగా ఈ కొత్త ఇంటిలో గృహప్రవేశం కూడా చేసింది. “కొత్త ఇల్లు అనేది జ్ఞాపకాలను ఏర్పరుచుకోవడానికి, కలలను నెరవేర్చుకోవడానికి ఒక ఉత్తమమైన ప్రదేశం. ఈ మైలురాయిని సాధించినందుకు నాకు నేనే కంగ్రాట్యులేషన్స్ చెప్పుకుంటున్నా. నాతో పాటు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికీ థాంక్యూ” అనే క్యాప్షన్‌తో ఈ తార తాజాగా ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కూడా షేర్ చేసింది.

ఈ పోస్ట్‌లో హిమజ తన ముద్దుముద్దు పాదాలతో కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్లు కనిపించింది. లక్ష్మీదేవి ఫోటో చేత పట్టుకొని సాంప్రదాయంగా తయారై పెదవులపై చిరునవ్వులు చిందిస్తూ ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా కనిపించింది. పండితుల ముహూర్తం ప్రకారం హిమజ ఈరోజు ఉదయం గృహప్రవేశం చేసింది. హిమజ కొత్తింటిలోకి ప్రవేశించిన నేపథ్యంలో ఫ్యాన్స్, ఫ్రెండ్స్, సెలబ్రిటీస్ విషెస్ చెబుతున్నారు. హిమజా చాలా లగ్జరీ సౌకర్యాలతో ఈ ఇంటిని నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. దాని విలువ కోట్లలోనే ఉంటుందని టీవీ వర్గాల్లో ప్రచారం కూడా జరుగుతోంది.

ఇకపోతే సీరియల్స్‌లో నటిస్తూ హిమజ యాక్టింగ్ కెరీర్ ప్రారంభించింది. సీరియల్లలో నటిస్తూనే సినిమాల్లో అడపాదడపా సపోర్టింగ్ రోల్స్ చేసి అలరించింది. నేను శైలజ, జనతా గ్యారేజ్, స్పైడర్, శతమానం భవతి, వినయ విధేయ రామ వంటి చిత్రాల్లో నటించినందుకు గాను ఈ ముద్దుగుమ్మకు చాలా గుర్తింపు దక్కింది.